కరోనా వల్ల లాక్ డౌన్,మరో సమస్య తో ఆందోళన చెందుతున్న అధికారులు

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న భీభత్సం తో దేశాలు ఆందోళన లో కొట్టుకుంటున్నాయి.ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించాయి కూడా.

 Lock Down Effect Domestic Violence Cases Registered,domestic Violence, France L-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ లో కూడా మార్చి 17 వ తేదీ నుంచి లాక్ డౌన్ ను విధించింది.అయితే ఎదో వైరస్ ను అరికడదాం అని అనుకుంటే ఆ దేశంలో మరో సమస్య ఎక్కువగా ఉంటుందట.

ఇంతకీ ఆ మరో సమస్య ఏమిటంటే గృహ హింస కేసులు.ఫ్రాన్స్ లో లాక్ డౌన్ విధించడం తో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచే పనిచేయాల్సి వస్తుంది.

దీనితో ఆ దేశంలో ఇప్పటివరకు 30 శాతం పైగా గృహ హింస కేసులు నమోదు అయినట్లు స్వయంగా ఆదేశ హోంమంత్రి క్రిస్టోఫర్ కాస్ట్నర్ తెలిపారు.

లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఆ దేశంలో ఒకటికాదు రెండు కాదు ఏకంగా 30 శాతం పైగా గృహ హింస కేసులు నమోదు అయినట్లు సమాచారం.20వేల జనాభా ఉండే ప‌ట్ట‌ణాల్లో 32 శాతం, పారిస్‌లో 36 శాతం గృహ హింస కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌లు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారని, దాంతో ఇండ్ల వ‌ద్ద వేధింపులు ఎక్క‌వ‌వుతున్నట్లు బాధితులు మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఐరోపాలో గృహ హింస రేటు అత్యధికంగా ఫ్రాన్స్‌లో ఉంది.ప్రతి సంవత్సరం, 18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల 219,000 మంది మహిళలు ప్రస్తుత లేదా మాజీ భాగస్వాములచే శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొంటారు, కాని 20% మాత్రమే దీనిని నివేదిస్తున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం, ప్రతి మూడు రోజులకు ఒక మహిళ భాగస్వామి లేదా మాజీ భాగస్వామి వల్ల మహిళలు చంపబడుతున్నారు.

ఈ క్రమంలో గృహ హింస బాధితుల‌కు సాయం చేసే ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు మంత్రి తెలిపారు.

అంతేకాకుండా భ‌ర్త‌ లేకుండా ఫార్మ‌సీల‌కు వెళ్లే వారికి కూడా ర‌క్ష‌ణ క‌ల్పించ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.ఆడ‌వారి ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక కోడ్ సిస్ట‌మ్‌ను అభివృద్ధి ప‌రుస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

డొమెస్టిక్ వాయిలెన్స్ కేసుల విష‌యంలో ఇప్ప‌టికే స్పెయిన్ దేశం ప్ర‌త్యేక కోడ్ సిస్ట‌మ్‌ను అమ‌లు చేస్తున్న‌ విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube