విశాఖ జిల్లా మధురవాడలో డొమస్టిక్ గ్యాస్ సిలిండర్స్ మాఫియా కలకలం సృష్టిస్తుంది.ఇంటి అవసరాలకు వినియోగించే సిలిండర్లను ఏజెన్సీలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర నుండి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు డొమస్టిక్ సిలిండర్లనే వినియోగిస్తున్నారు.అయితే ఈ అక్రమ దందా సివిల్ సప్లైస్ ఆర్ఐ కనుసన్నల్లోనే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.