డోలో 650నా మజాకా... ట్విట్టర్‌లో ట్రెండ్

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది.సెకండ్ వేవ్‌‌లా భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 Dolo 650 Tablets Trending On Twitter During Corona Third Wave Details, , Dolo 65-TeluguStop.com

రోజువారి కేసులు లక్ష పైచిలుకు నమోదు అవుతుండటంతో అందరీలో టెన్షన్ మొదలైంది.కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారీగానే పెరుగుతున్నాయి.

దీంతో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్ర ప్రభావం చూపింది.

ఆసుపత్రుల్లో బెడ్లు, సౌకర్యాలు లేక రోగులు అల్లాడిపోయారు.మరోవైపు కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ దొరకక.

ఇంకోవైపు ఆక్సిజన్ లభించక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.అయినవారు, ఆప్తులను కొల్పోయి వేలాది కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది కరోనా.

అలాగే పని లేక.వేలాది మంది రోడ్డున పడ్డారు.మరోపక్క కరోనాకు చాలా మంది తమకు తోచిన సొంత వైద్యం చేసుకున్నారు.సోషల్ మీడియాలో కరోనా‌కు సంబంధించిన వీడియోలు చాలానే షేర్ అయ్యాయి.వాటిని ఫాలో అవుతూ కొందరూ… తమకు నచ్చిన మందులు వేసుకుంటూ మరికొందరూ… ఇలా ఏవి పడితే అవి వేసుకున్న వారు లేకపోలేదు.మళ్లీ కరోనా థర్డ్ వేవ్ అంటూ నిత్యం వార్తలు హోరెత్తిపోతుండడంతో జనాల్లో ఆందోళన మొదలైంది.

జ్వరం ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.చాలా మంది డోలో 650 లాంటి ట్యాబ్లెట్లను ముందే కొనుగోలు చేసుకుంటున్నారు.

రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి.దీంతో ముందు జాగ్రత్తగా ఈ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు.దీంతో డోలో 650 మాత్ర ట్విట్టర్‌ ట్రెండింగ్‌గా మారింది.

#Dolo650 అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్‌ చేస్తోంది.జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో చాలామంది ఉంటే… మరికొందరు ఇది మంచిది కాదంటూ సూచనలు చేస్తున్నారు.

దీంతో డోలో 650పై భిన్న రకాల మీమ్స్ ట్విట్టర్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.వీటిపై మీరు ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube