రోడ్డుపై డబ్బు...జనం పరుగో పరుగు...ఎక్కడో తెలుసా...?

రోడ్డు మీద గాల్లో ఎగురుతూ… డబ్బు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు… ఎగిరి గంతులేస్తూ… గబగబా అందినకాడికి పట్టుకుని పరుగులు పెడతారు తాజాగా …అమెరికా లో అదే జరిగింది.ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను వెనుక తలుపు అనుకోకండా తెరుచుకోవడంతో రోడ్డు మీద కరెన్సీనోట్లు పడిపోయాయి.

 Dollars Due To Brinks Van Door Malfunction1-TeluguStop.com

ఉత్తపుణ్యానికే నోట్లు రోడ్డు మీద దొరుకుతుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు ఏరుకున్నవారికి ఏరుకున్నంతా అన్నట్టు జనం పెద్దపెట్టున ఎగబడ్డారు.కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి నోట్లవేటలో పడ్డారు.

దీనివల్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది.కొన్నివాహనాలు అదుపుతప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి.

అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది.

బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి.ఒకదాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.మొత్తం 5.1 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.37 లక్షలు) ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు.బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు.చాలామంది డబ్బు ఇండ్లకు పట్టుకుపోగా కొందరు మాత్రం నిజాయితీగా ఈస్ట్ రూథర్‌ఫర్డ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తమకు రోడ్డుమీద దొరికిన నగదును అప్పగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube