ఉద‌యం లేవ‌గానే ఈ ప‌నులు చేస్తే.. రిస్క్‌లో ప‌డ‌తారు జాగ్ర‌త్త‌!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఉంటున్నారు.ఒక్కొక్క‌రిది ఒక్కో లైఫ్ స్టైల్‌.

 Doing These Things Early In The Morning Puts You At Risk! Early Morning- Latest-TeluguStop.com

ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా ఉంటారు.అయితే కొంద‌రు సాధార‌ణంగా ఉద‌యం లేవ‌గానే తెలిసో తెలియ‌క‌నో చిన్న చిన్న త‌ప్పులు చేస్తుంటారు.

అయితే ఆ చిన్న చిన్న త‌ప్పులు ఒక్కోసారి తిప్ప‌లు తెచ్చి పెడుతుంటారు.మ‌రి ఉద‌యం లేవ‌గానే ఎలాంటి త‌ప్పులు చేస్తే మంచిది కాదో ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఉద‌యం లేవ‌గానే వేడి వేడి బెడ్ కాఫీ లేదా బెడ్ టీ తాగుతుంటారు.

కానీ, ఇలా చేయ‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

ఇలా ఖాళీ క‌డుపుతో టీ తాగ‌డం వ‌ల్ల అల్స‌ర్‌, గ్యాస్‌, ఎసిడిటీ వంటి స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది.ముఖ్యంగా పాల‌తో త‌యారు చేసే టీ లేదా కాఫీను ఉద‌యం లేవ‌గానే తీసుకుంటే.

ర‌క్తంలో బ్లాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తుంది.అందువ‌ల్ల‌, ఉద‌యం లేవ‌గానే ఆ గ్లాస్ వాట‌ర్ తీసుకోవాలి.

అనంత‌రం టీ లేదా కాఫీ వంటి పానియాలు తీసుకోవాలి.

అలాగే చాలా మంది మ‌హిళ‌లు ఉద‌యం లేవ‌గానే వంట గ‌దిలో దూరేసి.

పనులన్నీ నెత్తిన వేసుకొని తెగ చేసేస్తుంటారు.ఇలా చేయ‌డం కూడా ఆరోగ్యానికి మంచిది.

రాత్రి పడుకుని పొద్దున్న లేచేసరికి కడుపు ఖాళీగా ఉంటుంది.ఆ ఖాళీ కడుపుతోనే ప‌నులు చేస్తే క్ర‌మంగా ఆరోగ్యం దెబ్బ తింటుంది.

కాబ‌ట్టి, ఉద‌యం లేచిన త‌ర్వాత ఏదైనా ఆహారం తీసుకుని ఆ త‌ర్వాత ప‌నులు మొద‌లు పెట్టాలి.

Telugu Wake, Tips, Latest-Telugu Health - తెలుగు హెల్త్

ఇక కొంద‌రు మార్నింగ్ హ‌డావుడి హ‌డావుడిగా లెగుస్తూ ఉంటారు.అయితే వాస్త‌వానికి ఉద‌యం వేక‌ప్ అద్భుతంగా ఉంటే.రోజంతా కూడా ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.

అందువ‌ల్ల‌, లేవగానే గదిలోంచీ బయటకు వెళ్లిపోకుండా.ప్రశాంతంగా కూర్చోవాలి.

అనంత‌రం బ‌య‌ట‌కు వెళ్లి.తూర్పు వైపు కాసేపు నెల‌బ‌డాలి.

తూర్పు వైపే ఎందుకంటే.ఉద‌యం తూర్పు దిక్కున సూర్యుడు ఉద‌యించ‌డం వ‌ల్ల‌ ఆకాశం చాలా నిర్మలంగా, ప్రత్యేక రంగులతో ఉంటుంది.

అది మ‌న మ‌న‌సుకు ఆహ్లాదాన్ని క‌లిగిస్తుంది.మ‌రియు రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube