చేతిలో చెయ్యేసి చెప్పడం ఒకే.. ఇంకా సాయి తేజ్ ముఖం చూపించట్లేదు ఎందుకు?

Doing The Same Thing By Hand But Why Sai Tej Not Shown His Face Yet

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.మెగా ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టి తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 Doing The Same Thing By Hand But Why Sai Tej Not Shown His Face Yet-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే.

కానీ ఇంతవరకు అతని ముఖం మాత్రం చూపించలేదు.

 Doing The Same Thing By Hand But Why Sai Tej Not Shown His Face Yet-చేతిలో చెయ్యేసి చెప్పడం ఒకే.. ఇంకా సాయి తేజ్ ముఖం చూపించట్లేదు ఎందుకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తొలిసారిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.

ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వడమే కాకుండా ఉత్తమ నటుడుగా కూడా అవార్డు సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించాడు.ఇక కొన్ని సినిమాలు తనకు మంచి సక్సెస్ ను ఇవ్వగా మరికొన్ని సినిమాలు తనకు నిరాశ పరిచాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల కిందట హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై తన స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తుండగా బైక్ స్కిడ్ అవ్వడంతో అక్కడికక్కడే కిందపడిపోయాడు.

దాంతో అతడి ముఖానికి, ఛాతికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే అక్కడున్న సమీప ఆస్పత్రిలో చేర్చారు.ఆ తర్వాత అపోలో హాస్పిటల్ కి చేర్చగా దాదాపు నెల రోజులు ఎక్కువగానే హాస్పిటల్ లోనే ఉన్నాడు.

Telugu Face, Film Industry, Hero, Injuries, Mega Family, Republic Movie, Sai Dharam Tej Accident, Sai Dharam Tej Marriage, Sai Dharma Tej, Tollywood-Movie

ఇక ఈమధ్య సాయి ధరమ్ తేజ్ కోలుకోవటంతో తనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా పంపించారు అని తెలిసింది.కానీ ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ ముఖాన్ని మాత్రం చూపించలేదు.ఇదిలా ఉంటే తాజాగా ఆయన అభిమానులు కొందరు సాయి ధరమ్ తేజ్ కోసం తెగ ప్రశ్నలు వేస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ చెయ్యి మాత్రమే చూపిస్తున్నారు.ముఖం పై ఇంకా గాయాలు తగ్గలేదా.ముఖంపై ఏమైనా మార్పులు అయ్యాయా అని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.

Telugu Face, Film Industry, Hero, Injuries, Mega Family, Republic Movie, Sai Dharam Tej Accident, Sai Dharam Tej Marriage, Sai Dharma Tej, Tollywood-Movie

మరి ఈ విషయం గురించి సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు ఏమని స్పందిస్తారో చూడాలి.ఇదంతా పక్కన పెడితే ఇటీవలే తాను నటించిన రిపబ్లిక్ సినిమా కూడా విడుదల అయింది.ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కు మంచి సక్సెస్ ను అందించింది.ఇక ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ మరిన్ని అవకాశాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Face, Film Industry, Hero, Injuries, Mega Family, Republic Movie, Sai Dharam Tej Accident, Sai Dharam Tej Marriage, Sai Dharma Tej, Tollywood-Movie

దీంతో సాయి ధరమ్ తేజ్ కు మరో నెలరోజుల వరకు విశ్రాంతి అవసరమని ఆ తర్వాతే సినిమాలకు హాజరవుతారని తెలిసింది.ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ పెళ్లి గురించి కూడా హాట్ టాపిక్ గా మారింది.తను తనతో నటించిన మరో హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు త్వరలో వీరు పెళ్లి బంధం తో ఒకటి కానున్నట్లు బాగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి.మరి ఇవన్నీ విషయాల గురించి మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

#Sai Dharam Tej #Sai Dharam Tej #Family #Sai Dharma Tej #Republic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube