ఇలా చేస్తే తలనొప్పి మటు మాయం !  

doing so will give you releif from headache headache, tips, coffe,tea, health tips, fever, cough - Telugu Coffe, Cough, Fever, Headache, Health Tips, Tea, Tips

ఉరుకుల పరుగుల జీవితంగా మనిషి అలసటతో పాటు వర్క్ ప్రెషర్ తో తలనొప్పికి కూడా గురవుతున్నాడు.వర్క్ ప్రెషర్ ఎక్కువ అనిపించి తలనొప్పితో చిరాకుపడే వాళ్లను చాలానే చూస్తుంటాం.

TeluguStop.com - Doing So Will Give You Releif From Headache

దీని ప్రభావం ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.తలనొప్పిని తగ్గించుకోవడాని ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు.

మందులు వాడటం, డాక్టర్లను సంప్రదించడం లాంటివి కూడా చేస్తారు.అయితే సాధారణ తలనొప్పిని తగ్గించుకునేందుకు వంటింటి వైద్యమే మేలని నిపుణులు అంటున్నారు.

TeluguStop.com - ఇలా చేస్తే తలనొప్పి మటు మాయం -General-Telugu-Telugu Tollywood Photo Image

వంటిట్లో దొరికే కూరగాయలు, ఫ్రూట్స్, దినుసులతో తలనొప్పిని నయం చేసుకోవచ్చు.

మనిషి డీహైడ్రేషన్ కి గురైనప్పుడు తలనొప్పి బారిన పడతాడు.

శరీరానికి నీటితో పాటు పొటాషియం లాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా అవసరం.బంగాళదుంపలో 75 శాతం వరకు నీరు, పిండి పదార్థాలు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.

తలనొప్పి వచ్చినప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపను ఆహారంగా తీసుకుంటే తలనొప్పి తగ్గడంతోపాటు శరీరానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

శరీరం అలసటకు గురైనప్పుడు వర్క్ ప్రెషర్ ఎక్కువైతే తలనొప్పి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

అందుకే పని చేసే సమయాల్లో చెర్రీ ఫ్రూట్ ను పక్కన పెట్టుకోవాలి.తిన్న కొద్ది నిమిషాల్లో ఉత్తేజాన్ని కలుగజేస్తుంది.దీంతో తలనొప్పి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది.చెర్రీ అందుబాటులో లేకపోతే బీట్ రూట్ రసం తీసుకున్న ఫలితాన్ని కనబరుస్తుంది.

డీహైడ్రేషన్ బారి నుంచి, కళ్లకు చల్లదనాన్ని అందించడంలో కీర ఎంతో మేలును కలిగిస్తోంది.కీరదోసలో 97 శాతం వరకు నీరే ఉంటుంది.గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువ.వీటిని తీసుకోవడం వల్ల రక్తకణాలకు విశ్రాంతినిచ్చి తల నొప్పి తగ్గేలా చూస్తుంది.

గుమ్మడి గింజలు, బాదంను కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తలనొప్పి, జలుబు వచ్చినప్పుడు కొందరూ ఘాటైన పదార్థాలు తినేందుకు ఇష్టపడతారు.

జలుబుకు మిరియాలు ఎంతో ఉపయోగకరం.మిరియాల పొడిని వేడి నీళ్లు లేదా టామాటా జ్యూస్ లో కలిపి తీసుకుంటే జలుబు సమస్యతోపాటు తలనొప్పి మటుమాయం అవుతుంది.

ఓట్స్ లో కార్బోహైడ్రేట్స్ అధికం.ఓట్స్ తినడం వల్ల కూడా తలనొప్పిని మాయం చేయవచ్చు.

కాఫీ, టీ లలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది.తలనొప్పి ఉన్నప్పుడు టీ తాగడం వల్ల మెదడు నరాలను ఉత్తేజపరిచి తలనొప్పిని తగ్గిస్తుంది.అందుకే చాలా మంది ప్రజలు రిలాక్స్ అవ్వడానికి టీ ఎక్కువగా తాగుతుంటారు.

#Coffe #Headache #TIps #Fever #Cough

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు