గ్రూప్ ఫోటో కోసం అని పిల్లిని నోటితో లాగిన కుక్క

ఒకప్పుడు శత్రువుల గురించి మాట్లాడాలి అంటే ఎలుక-పిల్లి, కుక్క-పిల్లి లాగా కొట్టుకుంటారు అని సంభోదించేవారు.అంటే దాని అర్ధం ఆ రెండు ఎలా కొట్టుకుంటాయో శత్రువులు అనేవారు అలానే కొట్టుకుంటారు అని.

 Dogs Forced Cat To Place In Order For Group Photo, Dogs,  Group Photo, Social Me-TeluguStop.com

అయితే ఇప్పటి జనరేషన్ లో పిల్లులు-కుక్కలు అన్నీ కూడా ఒక దగ్గరే పెరుగుతున్న అది వేరే విషయం.అయితే ఆలా ఒకే యజమాని వద్ద ఉంటున్న 3 కుక్కలతో పాటు ఒకపిల్లి కూడా ఉంటుంది.

అయితే వాటన్నిటిని కలిపి గ్రూప్ ఫోటో తీయాలి అన్న ఉద్దేశ్యం తో ఆ యజమాని భావించాడు.దీనికోసం అని కెమెరా అంతా రెడీ చేశాడు.గ్రూప్ ఫోటో దిగడం కోసం ఆ 3 కుక్కలు కూడా బాగా రెడీ అయి స్టిల్ కూడా పెట్టాయి.అయితే వాటి పక్కనే ఉన్న పిల్లి మాత్రం అసలు ఫోటో దిగడం ఇష్టం లేదు అన్నట్లుగా మొహం పక్కకు తిప్పుకొని నిలబడింది.

మూడు కుక్కలూ చక్కగా డ్రస్ చేసుకుని ముంగాళ్లపై కూర్చుని ఉండగా, పిల్లి మాత్రం ఆ ఫోటో తో నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగా ఒక పక్కకు మొహం పెట్టి కూర్చుంది.అయితే అది గమనించిన ఒక కుక్క కు పిల్లి గారి ఫోజు నచ్చక మధ్యలో వెళ్లి ఆ పిల్లి మెడ పట్టుకొని పక్కకు లాక్కొచ్చి మరి సరిగా కూర్చోబెట్టింది.

ఇంత చేసినా కూడా ఆ పిల్లి ఏమాత్రం గ్రూప్ ఫోటో కు సహకరించకుండా మరోసారి ముఖం చాటేసింది.

అయితే ఈ వీడియో ఎక్కడ తీశారో తెలియదు కానీ సోషల్ మీడియా లో దర్సన మివ్వడం తో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

గ్రూప్ ఫొటో తీయాలంటే అందరూ కుదురుగా ఉండాలి. పిల్లలు పద్ధతిగా ఉండరు.అటూ ఇటూ కదలకుండా చాలాపాట్లు పడాలి.కానీ మనుషుల్లో మనుషుల్లా మెలిగే కుక్కలకు కూడా ఈ తిప్పలు తప్పలేదని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube