అక్కడ సగం కాలిన కరోనా శవాలను పీక్కుతింటున్న కుక్కలు ... దారుణం... 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ  నృత్యం చేస్తూ రోజు రోజుకి తన ప్రతాపాన్ని చూపిస్తూ చాలా వేగంగా విస్తరిస్తోంది.అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను ఎదుర్కొనే ప్రక్రియలో ఏ మాత్రం అలసట వహించిన  ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు… అయితే ఈ కరోనా వైరస్ తో పోరాడలేక ప్రాణాలు కోల్పోయిన టువంటి వారి  సంస్కారాలను నిర్వహించే  విషయంలో స్మశాన వాటిక నిర్వహణాధికారులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే హృదయం కలచివేస్తోంది.

 Corona Dead Body, Funeral Ground, Hyderabad , Corona Virus,-TeluguStop.com

తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఓ వృద్ధుడు కరోనా వైరస్ కారణంగా మృతి చెందాడు.దీంతో అతని కుటుంబ సభ్యులును స్మశానవాటికలోకి అనుమతించకుండా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

దీంతో మృతిడి బంధువు అస్థికల కోసం  వెళ్ళాడు. అయితే ఈ క్రమంలో మృత దేహం పూర్తిగా కాలకపోగా స్మశాన వాటిక లో ఉన్నటువంటి కుక్కలు పీక్కు తింటున్న దృశ్యాన్ని చూసి బోరున విలపించాడు.

అసలే తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బాధలో ఉంటె కనీసం అంతిమ సంస్కారాలకు కూడా హాజరు కాలేక పోయామని, దీనికి తోడు ఇలా చివరి క్షణాల్లో తమ దహన సంస్కారాలు నిర్వహించే విషయంలో స్మశానవాటిక అధికారులు నిర్లక్ష్యం వహించడం తమను ఎంతగానో కలచి వేసిందని వాపోతున్నారు.

అయితే ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

దీంతో కొంత మంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ కారణంగా స్మశాన వాటిక లో కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను ముట్టుకోవాలంటే భయపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి కొంతమంది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి  పరిస్థితులు కొంతకాలం కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి మహమ్మారి కరోనా వైరస్ ని అంతం చేసే వ్యాక్సిన్ ని  తొందరగా విడుదల చేయాలని కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube