కుక్కలు క్యాన్సర్ ని పసిగడతాయి..అమెరికా తాజా పరిశోధన..!!  

Dogs Can Identify Cancer-

విశ్వాసానికి మారుపేరు ఏదంటే చటుక్కున గుర్తొచ్చేది కుక్కలే.నమ్మకానికి వాటిని మించింది లేదని అందరికి తెలిసిందే.అయితే అవి వాసనలు పసిగట్టడంలో ఎంతో చురుకుగా ఉంటాయి.అందుకే పోలీసులు చెందించే అనేక క్రిమినల్ కేసుల్లో, బాంబు స్క్వాడ్స్ లలో వీటిని వినియోగిస్తారు.

Dogs Can Identify Cancer-

అయితే వీటికి ఉన్న అపారమైన శక్తి వాసనలని పసిగట్టడం ఇది కేవలం దొంగలని పట్టుకోవడం లో మాత్రమే కాదు క్యాన్సర్ లక్షణాలని సైతం పసిగడుతుందట.ఈ విషయాన్ని అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధించి వెల్లడించారు.

మనుషులతో పోలిస్తే వాసనలను పసిగట్టే శక్తి శునకాల్లో 10వేల రెట్లు అధికంగా ఉంటుందని.శునకాల్లోని ఈ శక్తిని సరిగ్గా వినియోగించుకుంటే కేన్సర్‌ను పసిగట్టవచ్చని తెలిపారు.

Dogs Can Identify Cancer-

ఈ పరిశోధనల విషయాలని ఫ్లోరిడాలో జరిగిన అమెరికన్ సొసైటీ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్‌ బయాలజీ వార్షిక సమావేశంలో హెల్త్ కేర్ సంస్థ బయోసెంట్‌డీఎక్స్‌కు చెందినా శాస్త్ర వేత్తలు తెలిపారు.అంతేకాదు మరిన్ని పరిశోధనలు శునకాలపై చేస్తున్నామని తెలిపారు.

.

తాజా వార్తలు