కుక్క తప్పిపోయిందని, మంచిర్యాల వాసి వినూత్నంగా!  

Dog Missing Flexi In Manchiryala-

మనుషులు తప్పిపోతే ప్రకటన ఇవ్వడం సాధారణంగా వింటుంటాం.పలానా వ్యక్తి తప్పిపోయాడు, చూడడానికి ఇలా ఉంటాడు,అలా ఉంటాడు అంటూ ఏవో గుర్తులు చెప్పి ఫోటోలు వేసి మరీ ప్రకటనలు ఇస్తూ ఉంటారు.అయితే మంచిర్యాల లో అందుకు భిన్నంగా ఒక ఘటన చోటుచేసుకుంది...

Dog Missing Flexi In Manchiryala--Dog Missing Flexi In Manchiryala-

ఒక వ్యక్తి కుక్క తప్పిపోయింది అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ ని తయారు చేసి మరి పెట్టాడు.మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి కి చెందిన శ్రీను అనే యువకుడు ఈ పని చేసినట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా హైదరాబాద్ నుంచి ఒక కుక్కను తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శ్రీను దానితో బాగా అనుభంధాన్ని పెంచుకున్నాడు.

అయితే నిత్యం శ్రీను తో కలిసి ఆడే కుక్క ఒక్కసారిగా కనిపించకుండా పోయింది.ఈ నెలఆ 8 వ తేదీన ఆ కుక్క కనిపించకపోవడం తో వెతికే పనిలో పడిన శ్రీను ఊరంతా గాలించినా కనిపించలేదు.

Dog Missing Flexi In Manchiryala--Dog Missing Flexi In Manchiryala-

దీనితో చివరికి విసిగిపోయి పెద్ద ఎత్తున చౌరస్తా లో ఒక ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసి తన కుక్క ఆచూకీ తెలిసిన వారు ఫోన్ చేయగలరు అంటూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు.ఫ్లెక్సీ తో పాటు ఒక చిన్న వీడియో కూడా విడుదల చేయడం తో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది.అయితే కుక్క తప్పిపోతే ఫ్లెక్సీ ఏంటి అన్నట్లు ఇప్పుడు నెటిజన్లు ఆ వీడియో ను చూసి తెగ కామెంట్లు పెడుతున్నారట.

మొత్తానికి కుక్క తప్పిపోయింది అని ఇంత పెద్ద ఫ్లెక్సీ కట్టడం తో అతగాడి ప్రేమ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.