IIFA అవార్డ్స్ లో అనుకోని అతిధి,ఫిదా అవుతున్న నెటిజన్లు  

Iifa అవార్డ్స్ లో అనుకోని అతిధి,ఫిదా అవుతున్న నెటిజన్లు-adithi Bhatia,international Film Academy

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక వీడియో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ ఆ వీడియో ఎక్కడిది అంటే ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్(IIFA) 2019-20 వేడుకలు ముగిసిన విషయం తెలిసిందే.అయితే ఈ వేడుకలకు పలువురు సెలబ్రిటీలు హాజరు కాగా,వారి తో పాటు ఈ వేడుకకు ఒక కుక్క కూడా వెళ్లింది.నిజానికి ఆ ఫంక్షన్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది.అయినప్పటికీ ఆ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా దాటుకొని అక్కడకు ఆ డాగ్ వెళ్లడం విశేషం.

Iifa అవార్డ్స్ లో అనుకోని అతిధి,ఫిదా అవుతున్న నెటిజన్లు-adithi Bhatia,international Film Academy-Dog Came To 2019 IIFA Awards Function Video-Adithi Bhatia International Film Academy

అయితే ఆ డాగ్ ని చూసిన నటి అదితి భాటియా దానిని కూడా ఇంటర్వ్యూ చేసింది.హాయ్… ఇక్కడకు అనుకోని అతిథి వచ్చింది తనను ఇంటర్వ్యూ చేసి బోలెడు విషయాలు తెలుసుకుందాం అంటూ అదితి భాటియా కుక్కను రకరకాల ప్రశ్నలు అడిగింది.అయితే ఆ కుక్క కూడా వాటికి సమాధానంగా తన ముందు రెండు కాళ్లతో షేక్ హ్యాండ్ ఇచ్చింది.

Iifa అవార్డ్స్ లో అనుకోని అతిధి,ఫిదా అవుతున్న నెటిజన్లు-adithi Bhatia,international Film Academy-Dog Came To 2019 IIFA Awards Function Video-Adithi Bhatia International Film Academy

ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియోని ఏడు లక్షల మందికి పైగా చూశారంటే ఇది ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అన్న విషయం అర్ధమౌతుంది.

ఆ వీడియో లో అదితి చెబుతున్నది వింటూ ఆ కుక్క ఎంతో పద్ధతిగా ఉండటాన్ని నెటిజన్లు తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.