విగ్రహం అని తెలియక ఆ కుక్క ఏం చేసిందంటే?  

dog tries playing, statue, viral video - Telugu

సాధారణంగా కుక్కలు, పిల్లులు లాంటి జంతువులు ఏదైనా బాల్ లాంటి వస్తువులు దొరికితే దానితో ఆడుకుంటూ ఉంటాయనే సంగతి తెలిసిందే.అదే విధంగా ఒక కుక్క కూడా తనకు దొరికిన బాల్ తో కొంతసేపు ఆడుకుంది.

 Dog Tries Playing Statue Viral Video Ball

ఆ తరువాత తనతో ఆడుకోవడానికి పార్ట్ నర్ కోసం ఎదురు చూసింది.అదే సమయంలో ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని కనిపించడంతో బాల్ ను ఆ వ్యక్తి వైపుగా తోసింది.

అనంతరం ఆ వ్యక్తి నుంచి రియాక్షన్ కోసం కుక్క చాలాసేపు ఎదురు చూసింది.కానీ ఆ వ్యక్తి ఎంతసేపటికీ ఆ బాల్ ను విసరలేదు.సాధారణంగా మనిషి ఐతే కుక్క బాల్ ను తోసిన వెంటనే ఏదో ఒక విధంగా స్పందించేవాడు కానీ అక్కడ ఉన్నది విగ్రహం కావడంతో కుక్క కొంత సమయం పాటు బాల్ ను ఆ వ్యక్తి విసురుతాడేమోనని ఎదురు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కుక్క వీడియో తెగ వైరల్ అవుతోంది.

విగ్రహం అని తెలియక ఆ కుక్క ఏం చేసిందంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఐఏఎస్ సుప్రియ సాహు కుక్క వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ విగ్రాహాన్ని “హే మీరు ఎందుకు బాల్‌ ఆడటం లేదు” అంటూ సరదా ప్రశ్నతో కామెంట్ పెట్టింది.అవతలి వ్యక్తి బాల్ విసురుతాడని కుక్క ఆ వ్యక్తి వైపు చూస్తున్న చూపులు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తున్నాయి.

నెటిజన్లు ఈ కుక్క వీడియోను చూసి దీనికి ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు

.

#Statue #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dog Tries Playing Statue Viral Video Ball Related Telugu News,Photos/Pics,Images..