ఆ పెంపుడు కుక్క ఆమె ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను మింగేసింది.. చివరికి!?

ఆమె ఒక కుక్కను పెంచుకుంది.ఆ కుక్క కాస్త ఆమెకు తలనొప్పి తెచ్చిపెట్టింది.

 Dog Swallows Owners Engagement Ring In South Africa-TeluguStop.com

చదవడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్న.ఆ కుక్క చేసిన పని.ఆ తర్వాత ఆమె చేసిన పని చూస్తే కడుపులో తిప్పడం ఖాయం.అలాంటి ఘటన ఇది.ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటు చేసుకుంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలాంటి ఈ ఘటన ఏంటి అంటే.పూర్తి వివరాల్లోకి వెళ్తే.నిశ్చితార్థం కోసం కొన్న ఉంగరాన్ని ఆమె పెంపుడు కుక్క మింగేసింది.ఇది చుసిన ఆ యజమానురాలు ఒక్కసారిగా షాక్ కి గురైంది.

ఖరీదైన ఉంగరం కుక్క మింగిందనో.లేక కుక్కకు ఏమైనా అవుతుంది అనే బాధనో తెలీదు కానీ.

వెంటనే ఆ పెంపుడు కుక్కను తీసుకోని వెటర్నరీ డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది.

Telugu Dogswallows, Owners, Africa-

దీంతో డాక్టర్లు ఆ కుక్కకు ఎక్స్‌రే తీయగా.నిజంగానే ఆ కుక్క పొట్ట లోపల ఉంగరం ఉండటాన్ని గుర్తించారు.ఇంకా ఆ ఉంగరాన్ని ఎలా అయినా బయటకు తియ్యాలి అనే ఆలోచనతో డాక్టర్లు ఆ కుక్క చేత కృత్రిమ వాంతులు చేయించి ఉంగరాన్ని బయటకు తీశారు.

అయితే ఆలా వాంతులు చేసుకోవడం వల్ల కుక్క నీరసించిందని.అయినా కూడా కుక్కకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు స్పష్టం చేశారు.అయితే ఇది అంత కూడా ఆ కుక్క యజమాని.ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube