సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా పాటిస్తున్న కుక్క పిల్ల.. వీడియో వైరల్!  

dog social distancing video viral in social media, Social Distance, Dog, Viral Video, Social Media, Puppy Social Distance - Telugu Dog, Dog Social Distancing Video Viral In Social Media, Puppy Social Distance, Social Distance, Social Media, Viral Video

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల మానవుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది.ప్రతి ఒక్కరి జీవితంలో మాస్కులు, సామాజిక దూరం లేదా భౌతిక దూరం, శానిటైజర్లు భాగమైపోయాయి.

TeluguStop.com - Dog Social Distancing Video Viral In Social Media

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ సోకకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు.సోషల్ డిస్టెన్స్ పాటించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.
అయితే మనుషులు సోషల్ డిస్టెన్స్ సరిగ్గా పాటించకపోయినా ఒక కుక్కపిల్ల మాత్రం సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా పాటిస్తోంది.నోటితో కర్రను అడ్డంగా పట్టుకుని రోడ్లపై ఇష్టానుసారం గుంపులుగుంపులుగా వెళుతున్న జనాలు తనను తాకకుండా ముందుకు వెళుతోంది.

ఎక్కడ మనుషులు తనను తాకితే కరోనా సోకుతుందో అనే విధంగా జాగ్రత్తగా ముందుకు నడుచుకుంటూ వెళుతోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో కుక్కపిల్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

TeluguStop.com - సోషల్ డిస్టెన్స్ ను సీరియస్ గా పాటిస్తున్న కుక్క పిల్ల.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

సామాజిక దూరం పాటిస్తున్న కుక్కపిల్లను చూసి అటువైపుగా వెళుతున్న మనుషులు సైతం కుక్కకు అడ్డు తగలకుండా వెళుతున్నారు.‘వెల్‌క‌మ్ టు నేచ‌ర్’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది.

కుక్కపిల్ల చేసిన పని మనుషులను ఆశ్చర్యపోయేలా చేయడంతో పాటు ఆలోచింపజేస్తోంది.వెల్ కమ్ టు నేచర్ సోషల్ మీడియా ఖాతాలో కుక్క సీరియస్ గా సామాజిక దూరాన్ని పాటిస్తూ పార్క్ లో తిరుగుతోందని కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోకు 13 వేల లైకులు రాగా లక్ష మంది చూశారు.సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కుక్కపిల్లకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

మనుషుల కంటే కుక్కపిల్ల చాలా స్మార్ట్ గా ఆలోచిస్తోందని కొందరు కామెంట్లు చేస్తోంటే మనుషుల కన్నా కుక్కపిల్లే నయం అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.కొందరు నెటిజన్లు మాత్రం కుక్కపిల్ల సూపర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

#DogSocial #PuppySocial #Viral Video #Social Distance #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dog Social Distancing Video Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..