బర్త్‌డే కోసం సొంతంగా షాపింగ్ చేస్తున్న కుక్క.. వీడియో వైరల్..!

జంతువులు, పక్షుల వీడియోలను నెటిజన్లు చాలా ఇష్టంగా వీక్షిస్తారు.ఇంటర్నెట్‌లోని ఈ వీడియోల్లో అన్ని రకాల ఫన్ దొరుకుతుంది.

 Dog Shopping For His Own Birthday Video Viral , Viral Video, Dog Video, Dog Sho-TeluguStop.com

అందుకే ఇది నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.కాగా తాజాగా ఒక కుక్క వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కుక్క తన పుట్టినరోజు బహుమతిని మాల్‌లో కొంటున్నట్లు కనిపించింది.ఈ వీడియో చూస్తుంటే ముచ్చటేసింది.

 Dog Shopping For His Own Birthday Video Viral , Viral Video, Dog Video, Dog Sho-TeluguStop.com

యజమాని తన పుట్టినరోజు కానుకగా తనకు కావలసినదాన్ని ఎంచుకోవడానికి షాపింగ్ మాల్‌లో కుక్కను విడిచిపెట్టాడు.దాంతో ఆ కుక్క నెమ్మదిగా బొమ్మల విభాగం వైపు కదులుతుంది.

చివరికి ఒక అందమైన గోధుమ రంగు బొమ్మను ఎంచుకుంటుంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు కుక్కను ప్రశంసిస్తున్నారు.

వావ్ ఇది చాలా తెలివైన కుక్క అని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోను ట్విటర్‌లో @Buitengebieden బ్యూటెంగేబిడెన్ షేర్ చేసింది.

ప్రజలు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.ఈ వీడియోకు ప్రజలు బీభత్సంగా లైక్‌లు కొట్టేస్తున్నారు.

ఈ క్యూట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

నిజానికి కుక్కలు షాపింగ్ మాల్ కి వెళ్లి షాపింగ్ చేయడం కొత్తేం కాదు.

కొన్ని కుక్కలు స్ట్రీట్ మార్కెట్‌కి వెళ్ళి తమ యజమానుల కోసం కూరగాయలు తీసుకు రావడం కూడా నేర్చుకుంటున్నాయి.వీటికి సంబంధించిన వీడియోలు కూడా చాలాసార్లు వైరల్ అయ్యాయి.

ఇక ఆర్మీలో, పోలీస్ రంగంలో కూడా కుక్కలు శత్రువులను పట్టించేందుకు ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి.ఈ విధంగా మనుషులకు కుక్కలు ఎంతో సహాయపడుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube