పులిని భయపెట్టిన పెంపుడు కుక్క! విశ్వాసంకి మరో సాక్ష్యం

ఒక మనిషిని పెంచుకునే బదులు కుక్కని పెంచుకోవడం బెటర్ అనే సామెత చాలా కాలంగా ఉంది.కుక్కకి విశ్వాసం ఎక్కువ అని చెప్పడానికి దీనిని వాడుతూ ఉంటారు.

 Dog Saves His Masters Life During Tiger Attack-TeluguStop.com

కుక్కలకి నిజంగానే విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని, తమని చేరదీసి పెంచిన యజమాని కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయిన సిద్ధం అవుతాయని శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యింది.అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కుక్కలలో ఉండే విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో చూపిస్తూ ఉంటాయి.

తాజాగా అలాంటి సంఘటన మధ్యప్రదేశ్ లోని పరాస్ పని అనే గ్రామంలో జరిగింది.పంచమ గజ్బా అనే వ్యక్తి తన సోదరుడితో కలసి సమీపంలోని అటవీ ప్రాంతంలో పొద్దున మల విసర్జనకు వెళ్లాడు.

తన సోదరుడు కొంచెం దూరంలో ఉండగా, పళ్లు తోముకోవడం కోసం ఓ చెట్టు కొమ్మను విరిచేందుకు అతను వచ్చాడు.అయితే అప్పటికే పొదల్లో ఉన్న పులి అతడి మీదకు దూకి అతని భుజాల మీద పంజా వేసి నిలబడి అతనిని చంపే ప్రయత్నంలో ఉంది.

అయితే అంతలో అక్కడే ఉన్న కుక్క గట్టిగా అరవడం మొదలెట్టింది.దీంతో ఆ పులి కొంచెం ఆగి అటూ ఇటూ చూసింది.పులిని చూసినా కుక్క బెదరకుండా మీదకి వస్తూ గట్టిగా కేకలు వేయడం మరింత పెంచింది.అది చూసిన పంచమ గజ్బా సోదరుడు కూడా అక్కడికి వచ్చాడు.

సమీపంలో ఉన్న గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకోవడంతో అందరిని చూసిన పులి తోక ముడిచి మెల్లగా అక్కడి నుంచి జారుకుంది.ఇప్పుడు ఆ కుక్క చేసిన సాహసం గ్రామంలో సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube