మునిగిపోతున్న మిడతను కాపాడిన కుక్క.. వీడియో వైరల్!

ఈ మధ్య కాలంలో చాలామంది మనుషులు మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.అయితే మనుషులకు మానవత్వం లేకపోయినా జంతువులు మాత్రం ప్రేమను, విశ్వాసాన్ని చాటి చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నాయి.

 Dog Saves Grasshopper From Drowning Twitter Cant Help But Laud The Good Boy  Dog-TeluguStop.com

మనుషుల కంటే జంతువులే ఎంతో బెటర్ అని ప్రూవ్ చేస్తున్నాయి.వాటిని చూసి మనుషులే ఎన్నో విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చాటి చెబుతున్నాయి.

సందర్భాన్ని బట్టి సహాయం చేయడంలో జంతువులు ముందువరసలో నిలుస్తున్నాయి.తాజాగా ఒక కుక్క మిడతను కాపాడి వార్తల్లో నిలిచింది.ట్విట్టర్ లో షేర్ అయిన వీడియో నెటిజన్లు ఎంతో ఆకట్టుకుంటోంది.కుక్క మిడతను కాపాడిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

వేర్వేరు జాతులకు చెందిన జీవులైనా ఒక జంతువు మరో జీవిని కాపాడటం గమనార్హం.ఎర్త్ బ్యూటీ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ అయిన ఈ వీడియో “మునిగిపోకుండా మిడత కాపాడబడింది” అనే శీర్షికతో వైరల్ అవుతోంది.

తక్కువ నిడివి గల ఈ వీడియోలో సాధారణంగా చూస్తే కుక్క నీళ్లను తాగుతున్నట్టు అనిపిస్తుంది.అయితే పరిశీలనగా చూస్తే మాత్రం కుక్క మిడతను కాపాడటం మనకు అర్థమవుతుంది.

నీటి లో నుంచి మిడతను కాపాడిన కుక్క అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.వెళుతూ వెళుతూ వెనక్కు తిరిగి కాపాడిన మిడత ఏం చేసిందో చూసింది.

ప్రాణాలతో బయట పడిన మిడత బ్రతుకు జీవుడా అనుకుంటూ గాలిలో ఎగురుకుంటూ వెళిపోయింది.ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీగా లైకులు, షేర్ లు వస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube