పసికందును కన్న తల్లి సజీవంగా మట్టిలో పూడ్చి పెట్టింది... ఒక కుక్క ఆ చిన్నారి ప్రాణం కాపాడింది  

Dog Saves Baby Buried A In A Thailand Field-dog,love,police,pregnant,thailand,women,కుక్క,థాయిలాండ్‌

మానవత్వం మంట కలిసి పోతుందని మనం పదే పదే అనుకుంటూనే, చెప్పుకుంటూనే ఉన్నాం. మనుషులు మారుతున్నారు, వారి అవసరాలు మారుతున్నాయి. దాని కారణంగా మానవత్వం అనే విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు..

పసికందును కన్న తల్లి సజీవంగా మట్టిలో పూడ్చి పెట్టింది... ఒక కుక్క ఆ చిన్నారి ప్రాణం కాపాడింది-Dog Saves Baby Buried Alive In A Thailand Field

అత్యంత దారుణమైన విషయం ఏంటీ అంటే జంతువులకు ఉన్న కనీస కనికరం మరియు ప్రేమాభిమానులు మనుషులకు లేకుండా పోతున్నాయి. ఒక యువతి మానవత్వం మరిచి పోయి, ఒక మనిషిని అనే విషయన్ని కూడా గుర్తులేకుండా తన కన్న బిడ్డను మట్టిలో పూడ్చితే, అదే పసి గుడ్డును ఒక కుక్క బతికించింది. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.

ఉత్తర థాయిలాండ్‌లో జరిగిన ఈ సంఘటన మానవత్వంకు మరక అని చెప్పుకోవచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే థాయిలాండ్‌లోని ఒక చిన్న గ్రామంలో ఈ సంఘటన జరిగింది. 15 ఏళ్ల ఒక యువతి కుటుంబ సభ్యులకు తెలియకుండా గర్బవతి అయ్యింది. అయితే తల్లిదండ్రులకు తెలిస్తే ఎక్కడ తిడతారో అనే ఉద్దేశ్యంతో మ్యానేజ్‌ చేసేందుకు ప్రయత్నించింది.

చివరకు డెలవరీ అయిన తర్వాత ఆ పసికందును ఊరికి చివర్లో ఉన్న ఒక నిర్మానుశ ప్రాంతంకు తీసుకు వెళ్లింది. ఆ సమయంలో ఎవరు అక్కడ లేకపోవడంతో కొద్ది లోతు మట్టిని తొవ్వి అందులో ఆ పసికందును పూడ్చి పెట్టింది. అప్పటికే ఆ పసికందు బతికే ఉండటం మరింత దారుణం.

బతికున్న పసికందును మట్టిలో పూడ్చిపెట్టి ఆమె అక్కడ నుండి వెళ్లి పోయింది.

కాస్త దూరం నుండి ఈ మొత్తం విషయాన్ని చూస్తూనే ఉన్న ఒక కుక్క ఆ యువతి అక్కడ నుండి వెళ్లి పోయిన వెంటనే చిన్నారిని పూడ్చి పెట్టిన ప్రదేశం వద్దకు వెళ్లి మట్టి తోడటం మొదలు పెట్టింది. అప్పుడే అటుగా వెళ్తున్న కుక్క యజమాని ఏం చేస్తుందా అంటూ చూస్తున్న సమయంలో కుక్క మట్టి తోడుతున్న చోట చిన్నారి చేయి, కాలు బయటకు వచ్చింది.

దాంతో వెంటనే పూర్తి మట్టిని తీసి వేయగా చిన్నారి బటయకు వచ్చింది. అప్పటికి కూడా ఇంకా చిన్నారి బతికే ఉంది. దాంతో వెంటనే స్థానిక హాస్పిటల్‌కు ఆ కుక్క యజమాని తీసుకు వెళ్లి, శిషు సంరక్షణ కేంద్రంలో ఆ పాపాయిని ఇచ్చారు.

పోలీసులు విచారణ జరుపగా ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోయి పాపాయికి జన్మనిచ్చి ఆమె వదిలించుకోవాలని చూసింది. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆ చిన్నారిని పెంచుతామంటూ పోలీసులకు హామీ ఇచ్చి తీసుకున్నారు. కుక్క కొన్ని నిమిషాలు ఆలస్యంగా స్పందించినా లేదంటే కుక్క పట్టించుకోకున్నా కూడా ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయేది.