కుక్క, కుందేలు పిల్ల‌ను పెంచుకుంటున్న కోడి.. వీడియో చూస్తే

మ‌నం అనుకుంటాం గానీ జంతువుల‌కు కూడా మ‌నుషుల్లాగే ఎమోష‌న్స్ ఉంటాయండోయ్‌.అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమ‌ను చూపిస్తుంటాయి.

 Dog, Rabbit Raising A Hen  If You Watch The Video, Amazing Hen, Viral Video-TeluguStop.com

కాక‌పోతే ఎప్పుడు ప‌డితే అప్పుడు మ‌నుషుల్లాగా చూపించ‌కుండా.అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వాటిని చూపిస్తుంటాయి.

ఇలా ఫ్రెండ్ షిప్ కోసం ఇత‌ర జంతువుల‌తో పోట్లాడిన వీడియోలు కూడా మ‌నం నెట్టింట్లో అనేకం చూస్తున్నాం.అయితే ఇప్పుడు ఇత‌ర జంతువ‌లును పెంచుకుంటున్న జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అనేకం వైర‌ల్ అవుతున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.అయితే ఇది కూడా ఇత‌ర జంతువుల‌ను ద‌త్త‌త తీసుకునే విష‌యానికి సంబంధించిందే.

కాగా ఈ వీడియో ఇప్పుడు నెటిజ‌న్ల మ‌న‌సుల‌ను దోచేస్తుంది.ఎందుకంటే మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు కోడి ఇత‌ర జంతువుల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం అనేది జ‌ర‌గ‌దు.

దాని పోలిక‌ల‌తో ఉండే బాతు పిల్ల‌ల‌ను కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌దు.అలాంటిది కుక్క పిల్ల‌ను, కుందేలు పిల్ల‌ను ఇంకెలా చూస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చ‌ర్య పోతారు.

ఎందుకంటే ఇందులో ఓ కోడి ఆశ్య‌ర్య‌పోయే విధంగా.

కుక్క పిల్ల‌ను, కుందేలు పిల్ల‌ను ద‌త్త‌త తీసుకుంది.వాటిన త‌న చిన్న కోడి పిల్ల‌ల‌తో పాటు పెంచుకంటోంది.

వాటిని కూడా త‌న గుడ్ల వ‌ద్దే త‌న కిందే ఉంచుకుంటోంది.పైగా అక్క‌డ‌కు వ‌చ్చిన కోడి పుంజు కూడా ఆ జంతువుల‌ను ఏమీ అన‌కుండా ఉండ‌టం ఇక్క‌డ విశేషం.

మొత్తానికి ఆ కోడి ఇలా కుక్క పిల్ల‌ను, కుందేలు పిల్ల‌ను పెంచుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దీని మీద చాలా భిన్న‌మైన కామెంట్లు వెలువ‌డుతున్నాయి.చాలామంది చాలా ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube