వీల్ చెయిర్ కి పరిమితమయిన యజమానిని ఊరంతా తిప్పేస్తున్న శునకం..

మనిషివా పశువ్వా అంటూ తిడుతూ ఉంటాం కాని… ఈ రోజుల్లో మనిషికంటే నోరు లేని జంతువులే నయం అని ఎన్నో ఘటనలు నిరూపించాయి.మానవత్వం ఉండాల్సిన మనుషుల్లో క్రూరత్వం పెరుగుతుంటే ,అదే జంతువులు మానవత్వంతో మసలుకుంటున్నాయి…అలాంటిదే ఈ శునకం కూడా.వీల్ చెయిర్ కి పరిమితమైన తన యజమానిని వీధుల్లో తిప్పేస్తుంది…

 Dog Pushes Wheelchair Of Paralysed Owner Herat Touching-TeluguStop.com

డేనియల్ అలార్కాన్ అనే వ్యక్తికి కొన్నేళ్ల కిందట రోడుప్రమాదం జరిగింది.ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో వెన్ను పూర్తిగా దెబ్బతిని వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు.అయితే తనకు అండగా నేనున్నానంటూ తన పెంపుడు కుక్క డిగాంగ్ ముందుకొచ్చింది.వీల్‌చైర్‌లో డేనియల్ ఎక్కడికి వెళ్లాలన్నా డిగాంగ్ అనే ఈ కుక్కనే తీసుకెళుతుంది.తన తల ముక్కుతో వీల్‌చైర్‌ను తోస్తూ డిగాంగ్ ను బయట తిప్పుతుంది.ఇంతకీ ఈ కుక్క వయస్సు ఎంతనుకుంటన్నారు… కేవలం ఏడు నెలల చిన్న కుక్కపిల్ల డిగాంగ్.

పుట్టినప్పటి నుంచి డేనియల్‌తోనే ఉండటంతో తన యజమాని పట్ల ఎనలేని విశ్వాసం ఆ శునకం చూపిస్తుంది.విశ్వాసం అనగానే మనకు టక్కున గుర్తొచ్చే జంతువు కుక్క.

ఫిలీప్పీన్స్ వీధుల్లో ఈ శునకం తన యజమానిని వీల్‌ఛైర్ పై తీసుకెళ్లడం .చూసేవారికి ముచ్చటగొలుపుతుంది.అలా చూసినవారెవరో కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

అంతే డిగాంగ్ తో పాటు డేనియల్ కూడా సెలబ్రిటి అయిపోయారు.డేనియల్‌ను కలిసి డిగాంగ్ తో సెల్ఫీలు తీసుకోవడమే కాదు… వారిద్దరిని బయటికి తీస్కెళ్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube