కంప్యూట‌ర్ లో గేమ్ ఆడేస్తున్న డాగ్‌.. చూస్తే న‌వ్వుకోవాల్సిందే

Dog Playing A Game On The Computer You Have To Laugh When You See It

ఈ మ‌ద్య పెంపుడు జంతువులు కూడా చాలా తెలివి మీరిపోతున్నాయండోయ్‌.అచ్చం మ‌నుషులు చేసే ప‌నులు చాలానే చేసేస్తున్నాయి.

 Dog Playing A Game On The Computer You Have To Laugh When You See It-TeluguStop.com

నిత్యం అవి ఇంట్లోనే ఉండ‌టంతో త‌మ ఓన‌ర్లు చేసే ప‌నుల‌న ద‌గ్గ‌రి నుంచి గ‌మ‌నిస్తున్నాయి.దీంతో అచ్చం వారు చేసిన‌ట్టే యోగాలు, ఎక్స‌ర్ సైజులు, ర‌న్నింగ్, బంతి ఆట ఇలాంటివి ఎన్నో చేస్తున్నాయి.

ఇక ఓన‌ర్ చెప్పిన‌ట్టు చేయ‌డం బాగా అల‌వాటు చేసుకుంటున్నాయి.వాటికి మ‌నుషులు త‌ప్ప మ‌రో లోకం తెలియ‌క‌పోవ‌డంతో వారు ఏం చేస్తే అవి కూడా అలాగే చేయ‌డం స్టార్ట్ చేస్తున్నాయి.

 Dog Playing A Game On The Computer You Have To Laugh When You See It-కంప్యూట‌ర్ లో గేమ్ ఆడేస్తున్న డాగ్‌.. చూస్తే న‌వ్వుకోవాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా పెంపుడు కుక్కలు చాలా వ‌ర‌కు మ‌నుషుల‌ను ఫాలో అవుత‌న్నాయి.అయితే వాటికి సంబంధించిన అల్ల‌రి వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి.

ఇందులో చాలా వ‌ర‌కు ఫ‌న్నీగా కంటే కొన్ని సార్లు మాత్రం ఎమోష‌న‌ల్ గా ఉంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూస్తే నిజంగా న‌వ్వ‌లేక పొట్ట చెక్క‌ల‌వ‌డం గ్యారంటీ అని చెప్పొచ్చు.ఈ వీడియో చూస్తే గ‌న‌క ఓ కుక్క కంప్యూటర్‌లో గేమ్ ఆడటం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఇక కీ బోర్డు మీద ఇష్టం వ‌చ్చిన‌ట్టు కాళ్ల‌తో ఎగ‌రుతూ కొడుతుంది.

ఇంత సీరియ‌స్ గా అది గేమ్ ఆడుతుంటే మ‌ధ్య‌లో త‌న ఓన‌ర్ వ‌చ్చి దాన్ని డిస్ట‌ర్బ్ చేయాల‌ని చూస్తాడు.ఇక అనుకున్న‌దే త‌డ‌వుగా ఆ వ్యక్తి గేమ్ ఆఫ్ చేస్తాడు.ఇంకేముంది అప్ప‌టి వ‌ర‌కు సీరియ‌స్ గా గేమ్ ఆడుతున్న కుక్క ఒక్క సారిగా కోపంగా ఓన‌ర్ ను చూస్తుంది.

నిజంగా అది చూసిన చూపు భ‌లే న‌వ్వు తెప్పిస్తోంది.ఇక వెంట‌నే కాళ్ల‌తో కీబోర్డును ఓన‌ర్ వైపు త‌న్న‌డం కూడా క‌నిపిస్తుంది.ఇందుకు సంబంధించిన పదమూడు సెకన్ల వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.దాన్ని చూసిన నెటిజన్లు ఫ‌న్నీ కామెంట్లు పెడుతున్నారు.

#Game

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube