ఆ రాష్ట్రంలో కుక్క మాంసం ఎక్కువ తింటారట...దాంతో...

మన దేశంలో పెంపుడు జంతువులకు మంచి ప్రాధాన్యత ఉంది.  ఇందులో కుక్క, పిల్లి, ఆవు, తదితర జంతువులను సాధారణంగా ప్రజలు తమ ఇళ్లల్లో పెంచుకుంటారు.

 Dog Meat Sale In Nagaland News, Dog Meat, Nagaland News, Nagaland State News, Do-TeluguStop.com

ఇందులో కూడా కుక్కకి కొంత మంది ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు.దీంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క కి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే చాలు విలవిలలాడి పోతుంటారు.

 కానీ మన దేశంలోని ఆ రాష్ట్రంలో మాత్రం కుక్కలను దారుణంగా చంపి తింటారన్న సంగతి ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.

వివరాల్లోకి వెళితే మన దేశంలోని అతి చిన్న రాష్ట్రాల్లో నాగాలాండ్ రాష్ట్రం ఒకటి.

కాగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా ట్రైబల్స్ జాతికి చెందిన ఆటవికులు నివాసం ఉంటారు. అంతేగాక ఈ రాష్ట్రంలో ఎక్కువగా దాదాపుగా నాలుగు వందల ట్రైబల్స్ తెగలకు సంబంధించిన ప్రజలు జీవిస్తున్నారు.

ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ నాలుగు వందల తెగలలో ఒక్కో తెగకి మరో తెగకి సంబంధం లేకుండా ఆచారాలు, సంప్రాదయాలు ఉంటాయి.

అయితే టెక్నాలజీ పరంగా దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలోని ప్రజలు మాత్రం ఇప్పటికీ తమ పూర్వికులు నేర్పించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తున్నారు అందువల్లనే ఇప్పటికీ ఇక్కడి కొంతమంది ప్రజలకు ఇంటర్నెట్ అంటే ఏమిటో కూడా తెలియదు.

 అయితే ఇక్కడ ఆశ్చర్య పోయే విషయం ఏమిటంటే మన దేశంలోనే అత్యధికంగా కుక్క మాంసం తినే ప్రజలు ఈ రాష్ట్రం లోనే ఉన్నారు. అంతే కాక ఇక్కడ కుక్క మాంసం విక్రయంచడం కోసం  పెద్ద పెద్ద మార్కెట్లు కూడా ఉంటాయి.

అలాగే కోళ్ల ఫారం, డైరీ ఫారం, లాగే కుక్కలను మాంసం కోసం పెంచుతారు.

అయితే ఒకానొక సమయంలో కుక్క మాంసం మంచి గిరాకీ పెరగడంతో ఇతర రాష్ట్రాల నుంచి కుక్కలని దిగుమతి చేసుకునేవారు దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి డిమాండ్ ఏమిటో అని.అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువగా క్రిస్టియన్ మతాన్ని నమ్ముతారు. భారతదేశంలో అత్యధికంగా క్రిష్టియన్ మతాన్ని నమ్మేటువంటి రాష్ట్రాల్లో నాగాలాండ్ రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.

ఇక ఈ రాష్ట్రంలో ఎక్కువగా ప్రజలు ఆంగ్లం భాషను మాట్లాడుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube