గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న కుక్క.. ఎక్కడంటే?  

dog, lock door, sangareddy district, Dog Locked door From Inside - Telugu Dog, Dog Locked Door, Dog Locked Door From Inside, Lock Door, Sangareddy District

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది.గదిలోకి వెళ్లి ఒక కుక్క దానంతట అదే గడియ పెట్టుకుంది.

TeluguStop.com - Dog Locked Door From Inside

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ ఘటన నిజంగా చోటు చేసుకుంది.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి తండాలో కొత్తగా నిర్మిస్తున్న వైకుంఠదామం గదిలోకి వెళ్లిన కుక్క గడియ పెట్టుకుని అనంతరం బయటకు రాలేక ఇబ్బందులు పడింది.

TeluguStop.com - గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న కుక్క.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

నిర్మాణం పూర్తైన ఆ గదికి పెయింట్ వేయడానికి వచ్చిన కూలీలు గది లోపల గడియ పెట్టి ఉండటంతో అవాక్కయ్యారు.వాళ్లు కొంత సమయం ఆలోచించినా లోపల గడియ పెట్టింది ఎవరో వాళ్లకు అర్థం కాలేదు.

కొంత సమయం ఎదురుచూసి అనంతరం కిటికీ ద్వారా లోపల ఎవరు ఉన్నారో చూడటానికి కూలీలు ప్రయత్నించారు.లోపల తోక ఊపుతూ ఉన్న కుక్కను చూసి ఆశ్చర్యపోయారు.

కూలీలు పొడవైన కర్ర సహాయంతో ఎంతో శ్రమించి గడియను తొలగించారు.అనంతరం తలుపులు తెరిచిన వెంటనే కుక్క ఆ గది నుంచి పరుగు లంకించుకుంది.

శునకం గడియ పెట్టుకుని గదిలో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.శునకం తెలివిని ప్రశంసిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

కుక్క తలుపుకు గడియ పెట్టుకోవడం గురించి తెలిసి స్థానికులు అవాక్కయ్యారు.

#Dog Locked Door #DogLocked #Lock Door

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dog Locked Door From Inside Related Telugu News,Photos/Pics,Images..