ఒక్క కాన్పులో 18 కుక్కపిల్లలు జననం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా చాలామంది ఎంతో ఇష్టంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులను పెంచుకుంటారు.వాటిని తమ సొంత పిల్లలగ భావించి వాటిపై ప్రత్యేక శ్రద్ధను చూపిస్తుంటారు.

 Dog,18 Puppies,special Breed,guntur,sweety,super Ovulation-TeluguStop.com

అంతే కాకుండా వారికి నచ్చిన ముద్దుముద్దు పేర్లలతో వాటిని పిలుస్తూ ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటారు.ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెంపుడు కుక్క వార్తల్లోకి ఎక్కింది ,దీని పేరు స్వీటీ.

స్వీటీ స్పెషల్ ఏమిటంటే ఒకే ఈతలో ఏకంగా 18 పిల్లలకు జన్మనిచ్చి వార్తల్లోకెక్కింది.

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడులో నివాసముంటున్న సైదారావు అనే వ్యక్తి ఈ కుక్క పిల్లను పెంచుకున్నాడు.

ఆ కుక్కకు కు స్వీటీ అనే పేరుపెట్టి తనఇంట్లో బిడ్డలాగా పెంచాడు.ఈ స్వీటీ గ్రేట్ డానీ బ్రీడ్ కు చెందినది.అయితే స్వీటీ ఒకేసారి 18 పిల్లలకు జన్మనివ్వడం తో ఎంతో ఆనందంగా ఉందని సైదారావు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

Telugu Guntur, Breed, Sweety-General-Telugu

సాధారణంగా మిగతా కుక్కలు 5 నుంచి 10 వరకు పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే కానీ, స్పెషల్ బ్రీడ్ కు చెందిన ఈ స్వీటీ ఒకేసారి 18 పిల్లలను కనటం చాలా అరుదైన విషయమని పశు వైద్య అధికారులు తెలిపారు.కానీ స్వీటీ తొలిసారిగా 10 పిల్లలకు జన్మనిచ్చిందని, ప్రస్తుతం ఇప్పుడు రెండవ సారి 18 పిల్లలకు జన్మనిచ్చిందని ఈ సందర్భంగా సైదారావు తెలిపారు.ఈ 18 పిల్లలలో 11 పిల్లలు ఆడవి కాగా, ఏడు మాత్రం మగవి పుట్టాయి.

సూపర్ ఓవలేషన్ కారణంగా చాలా ఇలాఓకే సారి ఇంత పెద్ద మొత్తంలో పిల్లలకు జన్మనిచ్చిందని పశువైద్యాధికారి తెలిపారు.ఇలా ఒకేసారి భారీ సంఖ్యలో పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదైన విషయమని ఈ సందర్భంగా వారు తెలిపారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఒకే ఈతలో 18 పిల్లలు పుట్టడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube