విచిత్రం: కుక్కను చూసి పరుగులు పెట్టిన ఎలుగు బంటి  

Dog Chases Bear From Garden-

ఎలుగు బంటి చూడడానికి భారీ కాయం తో భయంకరంగా కనిపిస్తూ దాన్ని చూడగానే ఎవరైనా భయపడేలా ఉంటుంది.అయితే అలాంటి ఎలుగు బంటి కుక్కను చూసి పరుగులంఖించిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటన అమెరికా లోని న్యూజెర్సీ లో చోటుచేసుకుంది.అమెరికా న్యూజెర్సీలో ఓ అడవికి దగ్గరగా ఉంది ఆ ఇల్లు.అయితే ఆ ఇంటి ఓనర్ కావాలని ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు.అయితే ఆ ప్రాంతం అడవికి దగ్గరగా ఉండడం తో ఇంజనీర్లు వద్దని వారించినప్పటికీ కూడా అక్కడే ఇల్లు కట్టుకోవాలని భావించాడు.

Dog Chases Bear From Garden--Dog Chases Bear From Garden-

దీనితో ఇల్లు కట్టేసుకున్నాడు.దీనితో ఆ ఇంటికి రెగ్యులర్ గా పాములు,అడవి జంతువులు కూడా వస్తూ పోతూ ఉంటున్నాయి.అయితే తాజాగా ఎలుగు బంటి కూడా ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది.అయితే ఆ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉండడం తో దీనిని గమనించిన ఇంటి సభ్యులు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

Dog Chases Bear From Garden--Dog Chases Bear From Garden-

వాళ్ల పనుల్లో వాళ్లున్నారు.ఆకలితో వచ్చిన ఆ ఎలుగు అక్కడ ఏదైనా తినడానికి దొరుకుతుందేమోనని వెతికింది.

దానికి ఏమీ దొరకలేదు కానీ ఆ ఇంటి పెంపుడు కుక్క వచ్చి ఒక్కసారిగా దానిపైకి దూకింది అంటే ఎలుగు పరుగులంఖించుకుంటూ తిరిగి అడవిలోకి పారిపోయింది.నిజంగా క్రూరమైన జంతువుగా చెప్పుకొనే ఎలుగుబంటి ఇలా కుక్కను చూసి పారిపోవడం విశేషం.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించి దృశ్యాలు ఆ ఇంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడం తో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.