వైరల్ వీడియో: పిల్లికి ఆహారం పెట్టిన కుక్క...!

కొన్ని సార్లు బద్ధ శత్రువులు కూడా మిత్రులుగా ప్రవర్తిస్తుంటారు.శత్రుత్వాన్ని పక్కన పెట్టి సాయం చేయడం.

 Dog Feeds Stray Cat Viral Video, Cat, Dog, Milk, Bun, Food, Owner, Bun, Humanity-TeluguStop.com

ఎదుట ఉన్న ప్రమాదం నుంచి కాపాడటం జరుగుతుంది.అందుకే అంటారు కాబోలు కొన్ని సందర్భాల్లో బద్ధ శత్రువునైనా నమ్మెచ్చు కానీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే మిత్రుడిని నమ్మలేమని.

అయితే తాజాగా చైనాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.చైనాలోని షాండోంగ్ ప్రావిన్స్ లో ఫూ అనే వ్యక్తికి పుడ్డింగ్ అనే కుక్క ఉంది.అయితే అనుకోకుండా ఓ అరుదైన ఘటన సంభవించింది.పుడ్డింగ్ కు, ఓ పిల్లికి మధ్య జరిగిన ఓ ఆశ్చర్యకరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పుడ్డింగ్ కు తన యజమాని రోజూ చాలా ఆహారాన్ని పెడుతుంటాడు.అయితే ఓ రోజు పుడ్డింగ్ కంటికి ఆకలిలో ఉన్న ఓ పిల్లి కనిపిస్తుంది.దీంతో చలించిపోయిన పుడ్డింగ్ తన యజమాని పెట్టిన ఆహారంలో ఓ రొట్టె ముక్కను తీసుకుని బయటకు వచ్చింది.పిల్లికి కనిపించేలా ఆ రొట్టె ముక్కను ఓ చోట పెట్టి మెల్లిగా వెనక్కి వస్తుంది.

అయితే చాలా మంది కుక్క పిల్లి బద్ధ శత్రువులు కదా.పిల్లిని పట్టుకోడానికి పుడ్డింగ్ ఆహారాన్ని ఎరగా వేస్తుందని భ్రమపడ్డారు.ఫూ ఈ సంఘటనను మొత్తం తన ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉన్నాడు.పుడ్డింగ్ ఫుడ్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఆ సయమంలోనే పిల్లి భయపడుతూ వచ్చింది.చుట్టుపక్కలు చూస్తూ కింద ఉన్న రొట్టెముక్కను నోట్లో వేసుకుని లగెత్తింది.

అది చూసిన పుడ్డింగ్ సంతోషంతో గంతులేసింది.ఈ వీడియోను రికార్డ్ చేస్తున్న ఫూ తన పెంపుడు కుక్క పుడ్డింగ్ ను చూసి ఎంతో మురిసిపోయాడు.

సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం చూసిన ప్రతి ఒక్కరూ వీడియో ఎక్కువ సేపు ఉంటే బాగుండంటూ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube