డాగ్-బ్యాట్…ఈ గబ్బిలాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే!  

dog face bat pic goes on viral ,bat,viral,social media,corona virus,Buettikofer\'s epauletted fruit bat,Africa - Telugu Africa, Bat, Buettikofer\\'s Epauletted Fruit Bat, Corona Virus, Dog Face Bat Pic Goes On Viral, Social Media, Viral

గబ్బిలాల గురించి ఎవరూ కూడా పెద్దగా చర్చించుకొనేవారు కాదు.ఏవో చెట్లపై అవి వేలాడుతూ వాటి జీవనం అవి కానిచ్చేవి.

 Dog Face Bat Pic Goes Viral

కానీ ఈ కరోనా మహమ్మారి రావడం తో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా గబ్బిలం గురించే మాట్లాడుకుంటున్నారు.అందుకే అవి ఎక్కడైనా కనిపిస్తే వాటిని తరిమేసేవరకు జనాలు వదలడం లేదు.

ఎందుకంటే ఈ గబ్బిలాల వల్లే కరోనా వచ్చి ఉంటుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం విదితమే.ఈ నేపథ్యంలోనే గబ్బిలాలు ఎక్కడ కనిపించినా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది.

డాగ్-బ్యాట్…ఈ గబ్బిలాలను చూస్తే అవాక్కవ్వాల్సిందే-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడో గబ్బిలం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నిజంగా ఎవరైనా ఆ ఫోటో చూసారు అంటేమాత్రం అది గబ్బిలమా లేక కుక్క నా అన్న అనుమానం రాకమానదు.ఎందుకంటే… దాని ముఖం అచ్చం కుక్క ముఖం లాగే ఉంది.అది కుక్క లాంటి ముఖం ఉన్న గబ్బిలమా… లేక… కుక్కే గబ్బిలంలా ఉందా అనే డౌట్ తప్పకుండా నెటిజన్ల కు వస్తుంది.

చూడడానికి అది కుక్క మొహం పోలి ఉండడం తో నెటిజన్లు అందరూ కూడా దానికి డాగ్-బ్యాట్ అనే పేరు పెట్టేశారు.అయితే నిజానికి గబ్బిలాలలో ఇవి కూడా ఒక రకం జాతి కి చెందినవని సమాచారం.

వీటి ముఖాలు కుక్కల ముఖాల్లాగే ఉంటాయి.కాకపోతే చిన్న సైజులో ఉంటాయి.

అంటే పులిని పోలినట్లుగా పిల్లులు ఉంటాయి కదా… అలాగే ఇవి కూడా కుక్కలను పోలినట్లు ఈ గబ్బిలాలు ఉంటాయట.ఈ ఫొటోని ట్విట్టర్ యూజర్ ఎమోషనల్ పెడాంట్ షేర్ చేశారు.

ఈ బ్యాట్ పేరు బ్యూటికోఫెర్స్ ఎపాలెట్టెడ్ ఫ్రూట్ బ్యాట్ (Buettikofer’s epauletted fruit bat) అని తెలిపారు.గబ్బిల్లాలో ఇవి కాస్త పెద్ద సైజులో ఉంటాయి.

కుక్కలతో వీటికి ఎలాంటి సంబంధమూ లేదని, అయితే ఇలాంటి గబ్బిలాలు ఇంకా చాలా రకాలున్నాయి.వాటి ఫేస్‌లు కూడా రకరకాలుగా ఉంటాయి అని తెలిపారు.

అయితే వాస్తవానికి ఈ గబ్బిలాలు చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ కాస్త డిఫరెంట్ గా ఉండడం తో నెటిజన్లు ఈ ఫోటో ను సోషల్ మీడియా తెగ వైరల్ చేశారు.

మరోపక్క ఈ విషయాన్నీ నమ్మలేక పోవడం తో కొందరు ఆ పేరు గూగుల్ లో సెర్చ్ చేసి మరీ ఈ గబ్బిలాలను చూసుకుంటున్నారు.

ఎందుకంటే అది కుక్క ముఖంతో ఉండటాన్ని వాళ్లు నమ్మలేకపోతున్నారు.ఆఫ్రికా దేశాలైన ఐవరీ కోస్ట్, గినియా, గినియా బిస్సు, లైబీరియా, నైజీరియా, సెనెగల్, సియెర్రా లియోన్‌లలో ఈ జాతి గబ్బిలాలు ఉంటాయి.

అడవులు, పొడి ప్రదేశాల్లో ఇవి ఉంటాయి.సవన్నా గడ్డి ప్రాంతాల్లో కూడా ఇలాంటి గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి అని సమాచారం.

#Corona Virus #Africa #Bat #Social Media #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dog Face Bat Pic Goes Viral Related Telugu News,Photos/Pics,Images..