ఆ మధ్య ఓ కుక్క ఇద్దరు వ్యక్తులను వెనకాల కూర్చోబెట్టుకుని బైకు నడిపిన సంగతి తెలిసిందే.ఆ వీడియో ఎంత పాపులర్ అయ్యిందో కూడా మనం చూశాం.
కుక్క అలా బైకు కూడా నడుపుతుందా అని జనం నోరెళ్లబెట్టారు.కాగా తాజాగా ఇప్పుడు మరో కుక్క దాని బాబులా మారి ఏకంగా కారు నడిపింది.
ఫ్లోరిడా దేశంలో అన్నె సబొల్ అనే మహిళకు మ్యా్క్స్ అనే కుక్క ఉంది.లాబ్రాడార్ రిట్రీవర్ జాతికి చెందిన ఈ కుక్క ఓ రోజు యజమాని కారులోకి ప్రవేశించి ఆ కారును రివర్స్‌లో నడపడం మొదలుపెట్టింది.
ఇది చూసిన యజమాని వెంటనే తన ఇంటిపక్కన వారికి సమాచారం ఇవ్వడంతో వారు కూడా వచ్చి ఆ కారును ఆపే ప్రయత్నం చేశారు.కానీ వారితో కాకపోవడంతో వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వచ్చే సరికి గంట సమయం పట్టింది.ఈ గంటసేపు కూడా ఆ కుక్క కారును రివర్స్‌లో గుండ్రంగా నడుపుతూనే ఉంది.
పోలీసులు వచ్చి ఆ కారును ఆపి లోపల చూడగా అందులో కుక్కను చూసి వారు అవాక్కయ్యారు.అయితే కారు యజమానిపై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇక ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో వదిలాడు.అంతే, ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.
ఏదేమైనా ఈ మధ్య మనుష్యులకంటే కూడా కుక్కలే ఫేమస్ అవుతున్నాయని అంటున్నారు నెటిజన్లు.