వైరల్: కుక్క కోసం రక్తదానం చేసిన మరో కుక్క!

ఏంటి నిజామా ? ఎక్కడ జరిగింది ? ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? ఈ ఘటన కోల్‌కతాలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

 Kolkata's Super Dog Donates Blood To Save Canine Life,dog Donate Blood,canine,do-TeluguStop.com

చెన్నైకి చెందిన ఓ జంట తమ పెంపుడు కుక్కను కాపాడటం కోసం దాన్ని వెంటబెట్టుకొని కోల్‌కతాకు తీసుకెళ్లారు.ఇంకా అక్కడ లాబ్రడార్ జాతికి చెందిన అనే సియా కుక్క దానికి రక్తదానం చేసి కాపాడింది.

అయితే చెన్నైకి చెందిన ఆ జంట పెంపుడు కుక్క పేరు డానీ.దాని వయసు 13 ఏళ్లు.అయితే ఈ కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది.దీంతో ఆ కుక్క చికిత్స కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే బెంగాలీ యాక్టర్ అనింద్య ఛటర్జీ ఆ కుక్కను కాపాడేందుకు ముందుకు వచ్చారు.దీంతో అతను తన కుక్క అయినా సియాను రక్తదానానికి సిద్ధం చేశారు.

కోల్‌కతాకు చెందిన వెటర్నరీ డాక్టర్ దెబాజిత్ రాయ్.ఆ కుక్కకి రక్తమార్పిడి చేసి ప్రాణాలు నిలిపారు.అంతేకాదు రక్తదానం చేసే సమయంలో సియా ఎటువంటి ఆందోళన చెయ్యకుండా.ఎలాంటి ఇబ్బంది పడకుండా రక్తాన్ని ఇచ్చింది.

అయితే సియా నుండి రక్తం తీసుకోవడానికి కేవలం 15 నిమిషాల సమయం తీసుకున్నారు.కాగా గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లని కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్‌ అనే కుక్క రక్తదానం చేసిరి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube