అమెరికాలో ఓ కుక్క యజమాని వినూత్న ఆలోచన..వైరల్ అవుతున్న వీడియో…!!!  

Dog Dering Wine Customer Lockdown - Telugu Dering Wine, Dog, Lockdown, Social Media, Viral Posts

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చేస్తున్న విలయతాండవం అన్ని దేశాలని సంక్షోభం లోకి నెట్టేసింది.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ కి పరిమితమై పోయాయి.

 Dog Delivering Wine Customer Lockdown

ఈ మహమ్మారిని అరికట్టాలటే కేవలం సామాజిక దూరం పాటించడమే ప్రధానమైన మందు గా భావించిన ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేశాయి.అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికతో కూడిన సూచనలు చేశాయి.

ఈ నేపథ్యంలోనే కుక్క కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలో ఓ కుక్క యజమాని వినూత్న ఆలోచన..వైరల్ అవుతున్న వీడియో…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాకు చెందిన ఈ కుక్క పేరు సోడా.

ఎంతో చురుకుగా.వేగంగా .ఎంతో తెలివైనది గా పేరు తెచ్చుకున్న సోడా, ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలెట్ అవ్వడానికి కారణం దాని యజమానే.ఎందుకంటే ఈ శునకం తన యజమానికి చెందిన కస్టమర్లకు మద్యాన్ని సప్లై చేస్తోంది.

దాంతో ఒక్క సారిగా ఇది సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.ఆనోటా ఈ నోటా ఈ కుక్క గురించి తెలుసుకున వాళ్ళు దాని సేవలు పొందటానికైనా మద్యం ఆర్డర్ ఇస్తున్నారట.

అమెరికాలోని మేరీలాండ్ కు చెందిన వ్యక్తి ఒక కుక్కని పెంచుకుంటున్నాడు.దాని పేరు సోడా ఆయనకు వైన్ షాప్ కూడా ఉంది.కరోనా ప్రభావం వల్ల ప్రజలు సామాజిక దూరం పాటించాలని అక్కడి ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తన వ్యాపారాన్ని నష్ట పోకుండా ఉండటానికి ఆ వైన్ షాప్ యజమాని ప్రభుత్వం సూచించిన సామాజిక సూచనలకి అనుగుణంగా తాను పెంచుకుంటున్న కుక్క ద్వారా కస్టమర్లకు మద్యం అందించేలా ట్రైనింగ్ ఇచ్చాడు దాంతో కస్టమర్లకు మద్యం సరఫరా చేస్తోంది.దీనికి సంబంధించిన ఓ వీడియోని ఒక కస్టమర్ సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు