కుక్క కొరికేసిన బొమ్మను రూ.54 లక్షలు పెట్టి కొన్న మహానుభావుడు!

54 లక్షల రూపాయలు వెచిస్తే ఒక పెద్ద ఇల్లే వస్తుంది.లేదంటే మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయవచ్చు.

 Dog-chewed Antique Doll Ready Sold For Rs 54 Lakh At An Auction In England Detia-TeluguStop.com

ఇంకా అంత డబ్బుతో జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు.అయితే ఈ మొత్తంతో ఒక మహానుభావుడు మాత్రం కుక్క కొరికేసిన ఒక బొమ్మను( Dog Chewed Doll ) కొన్నాడు.

పైగా బాగా దుమ్ము పట్టిపోయి, కుక్క కొరికిన గాట్లతో ఈ బొమ్మ ఉంది.మరి దీన్ని ఇంత ధరకు అసలు ఎందుకు కొన్నారు? దీని ప్రత్యేకత ఏమిటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంగ్లాండ్( England ) దేశంలో ఒక కుటుంబం ఒక అరుదైన బొమ్మను కలిగి ఉంది.చిన్నపిల్లాడి ఆకారంలో ఉన్న ఈ బొమ్మను వారు వెక్టిస్ ( Vectis Auction ) అనే సంస్థ ప్రతి సంవత్సరం జరిపే బొమ్మల వేలంలో( Dolls Auction ) ఉంచారు.ఈ బొమ్మ చెత్తలో నుంచి ఏరుకుని వచ్చి అక్కడ పెట్టినట్లుగా కనిపించింది.అయితే దీనికున్న ప్రత్యేకత ఏంటంటే.ఇది వందేళ్ల క్రితం నాటి బొమ్మ. అంత చరిత్ర ఉంది కాబట్టే దీన్ని ఆ కుటుంబ సభ్యులు వేలానికి తీసుకొచ్చారు.

అయితే ఇది తమకు ఏ లక్ష తెచ్చిపడుతుందోనని వారు భావించారు.కాగా వేలంపాటలో పాల్గొన్న ఒక వ్యక్తి దీనిని ఏకంగా 53,000 (దాదాపు రూ.54 లక్షల) పౌండ్లకు కొనుగోలు చేశాడు.ఈ సంగతి తెలిసి ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబై పోయింది.

దీనిని కొన్న వ్యక్తి ఈ బొమ్మ తనకొక ఒక మెమొరీ లాగా మిగిలిపోతుందని చెబుతున్నాడు.ఇంతకీ ఈ బొమ్మ పేరు ఏంటంటే.“క్యామర్ రైన్‌హార్డ్ట్ 102 వాల్టర్ బిస్క్యూ సాకెట్ హెడ్ యాంటిక్ డాల్”. 1910 లో ఇది ఒక గ్యారేజీలో దొరికింది.

ప్రపంచంలోని అరుదైన వాటిలో ఇది ఒకటని, దాని పెద్ద సైజు కారణంగా ఇది చాలా అందంగా ఉందని ఆక్షన్ కంపెనీ తెలిపింది.చక్కటి మోడలింగ్, ఎక్స్‌ప్రెషన్స్, అపారదర్శక పెయింటింగ్ ఈ బొమ్మను చూపు తిప్పుకోవనివ్వనంత అందంగా మార్చాయని కంపెనీ వెల్లడించింది.

ఏదేమైనా ఒక బొమ్మకు ఇంత ధర పెట్టడం నెటిజెన్లను నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube