రోడ్డుపైనే యువతి టిక్ టాక్ వీడియో,ఇంతలో కుక్క వచ్చి...

టిక్ టాక్ పేరు చెప్పగానే చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా ఏంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు.ఈ యాప్ లో వీడియో చూస్తూ ఉంటె టైం కూడా తెలియదు అని చెప్పాలి.

 Dog Bites Girl While Doing Tik Tok Video ,dog Bites,girl,tik Tok,viral,tik Tok V-TeluguStop.com

ఒకదాని తరువాత మరొకటి వీడియో వస్తూ అలా అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది.అయితే ఈ వీడియోలను చూడడానికి ఎంతగా ఇష్టపడతారో,కొంతమంది ఈ వీడియో లు చేయడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

చైనీస్ యాప్ అయినప్పటికీ కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఉపయోగిస్తూ వీడియోలు చేస్తూనే ఉన్నారు.తాజాగా ఒక యువతి ఇదే టిక్ టాక్ లో వీడియో చేస్తూ అనుకోని సంఘటనను ఎదుర్కొంది.

ప్రియా గోలనీ అనే యువతి రోడ్డుపై టిక్ టాక్ వీడియో చేసింది.కత్రినా కైఫ్ పాట జర జర టచ్ మీ టచ్ మీ సాంగ్‌కు స్టెప్స్ వేస్తూ ఒక వీడియో చేస్తుంది.

ఈ క్రమంలో వెనక నుంచి అకస్మాత్తుగా ఓ కుక్క వచ్చి ప్యాంట్‌ను కొరకటంతో వెంటనే అప్రమత్తమైన ఆ యువతి, అక్కడి నుంచి పక్కకు జరిగింది.దీనితో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

లేదంటే ఆ కుక్క కరిచి ఉండేది.

అయితే ఆ వీడియోను ప్రియా గోలనీ తన టిక్ టాక్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

ఈ చైనీస్ అప్లికేషన్ టిక్ టాక్‌ను కొందరు టైమ్ పాప్ కోసం యూజ్ చేస్తే.ఇంకొందరు మాత్రం సీరియస్‌గా దానికే పరిమితమయ్యారు.నిత్యం వీడియోలు తీయడం వాటిని సృజనాత్మకంగా రూపొందించడంలో కొన్ని ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.అయినప్పటికీ కూడా యువత మాత్రం ఈ టిక్ టాక్ ను మాత్రం వదలడం లేదు.

అదృష్టవశాత్తు ఆ యువతి ఆ కుక్క బారి నుంచి తప్పించుకుంది,లేదంటే కుక్క ఆ యువతి పై దాడి చేసి ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube