వైరల్: ఈ కుక్క టాలెంట్‌ చూస్తే ఫిదా అవ్వకుండా ఉండలేరు!

స్మార్ట్ ఫోన్స్ వాడకం విరివిగా పెరిగాక తదనుగుణంగా సోషల్ మీడియా ప్రభావం కూడా విపరీతంగా పెరిగిపోయింది.ఇపుడు సగటు మనిషి రోజుకి దాదాపుగా తక్కువలో తక్కువ 4 నుండి 5 గంటలు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నాడు అంటే అందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 Dog Ball Balancing Skill Viral Video Details, Dog, Talent , Viral Latest, News V-TeluguStop.com

దీనికి కారణం వైరల్ వీడియోలు అని వేరే చెప్పాల్సిన పనిలేదు.ఇక వైరల్ అవుతున్న వీడియోలలో ఎక్కువగా పెంపుడు శునకాలకు సంబంధించినటువంటి వీడియోలు ఉండటం కొసమెరుపు.

విశ్వాసం చూపడంలో కుక్కలకు సాటెవ్వరూ రారు.కుక్కలకు విశ్వాసమే కాకుండా తెలివితేటలు కూడా ఎక్కువే.తన యజమాని పట్ల చాలా విధేయతను చూపిస్తాయి.యజమాని చెప్పినట్టు నడుచుకోవడమే కాకుండా సందర్భానుసారంగా ప్రవర్తిస్తుంటాయి కూడా.ఆ కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.సదరు వీడియోని ఒకసారి గమనిస్తే, ఓ శునకం తన యజమాని గాల్లోకి విసిరిన బంతిని కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ శునకం బాల్‌ కిందపడకుండా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం ఇపుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.దీనికి సంబంధించిన వీడియో ఒకటి Buitengebieden అనే యూజర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా.ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.ఇది చూసిన నెటిజన్లు కుక్క ప్రతిభకు ఫిదా అవుతున్నారు.‘ఇలా చేయడం ఒక్కోసారి మనుషుల వల్ల కూడా సాధ్యం కాని పని!’ అని ఒకరంటే, ‘సో స్మార్ట్‌.’, ‘వాట్‌ ఏ స్కిల్స్‌.

’, ‘ఈ కుక్కతో పోటీ పడటం కష్టమే.’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube