“కుర్రాళ్ళ”... ప్రచారమే పవన్ కొంప ముంచుతుందా..???

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంచనాలు తలకిందులు అయ్యేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.తనకి సొంత ఛానెల్స్ , పత్రికలు లేవని, తానొక సామాన్యుడినని, నా భిమానులే నాకు ఛానెల్స్ , కార్యకర్తలే నాకు ప్రింట్ మీడియా అంటూ చెప్పే పవన్ కళ్యాణ్.

 Does Youth Campaigning Leads To Pawan Failure-TeluguStop.com

అభిమానులు సోషల్ మాధ్యమాలలో చేస్తున్న ప్రచారమే ఈరోజు జనసేన పార్టీ అజెండాని ప్రజల్లోకి తీసుకు వెళ్తోందని ఎప్పటికప్పుడు కుర్రాళ్ళ బుర్రల్లోకి తీసుకువెళ్తున్నారు.

దాంతో ఆకాశమే హద్దుగా రెచ్చేపోయే కుర్రాళ్ళు ,అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులు కుదురుగా ఉండలేరు కదా, అసలు విషయంపై దృష్టి పెట్టడం మానేసి సొంత పార్టీ విషయాలని పక్కన పెట్టి, ప్రధాన పార్టీలైన వైసీపీ ,టీడీపీ లపై విమర్సనాత్మకంగా పోస్టులు పెట్టడం, వారి తప్పులని ఎత్తి చూపడం, టీడీపీ,వైసీపీ నేతలు కార్యకర్తలకి డబ్బులు పంచుతున్న వీడియోలు పోస్ట్ చేయడం ఇలా సోషల్ మాధ్యమంలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు.

అంతేకాదు పవన్ కళ్యాణ్ పై ఎవరైనా ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే నేరుగా సోషల్ మీడియాలో వీడియో పోస్టులు పెడుతూ సీనియర్, జూనియర్ నాయకుడు అని కూడా లేకుండా వార్నింగ్ లు ఇస్తున్నారు.అంతేకాదు రోడ్లపై పిచ్చాపాటిగా తిరుగుతూ, వారి మోటార్ బైక్ లకి సైలెన్సర్ తీసేస్తూ వారు చేసే రణగొణ ధ్వనులతో ప్రజలకి పిచ్చి పట్టిస్తున్నారు.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.

జనసేన పార్టీకి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి కొద్దో గొప్పో క్యాడర్ ఉంది.అయితే ‘జనసేన’ కు సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులు ఎవ్వరూ లేకపోవడంతో కేవలం పవన్ అభిమానులు మాత్రమే తమ నాయకుడుకు ఓట్లు వేయండి అంటూ ప్రచారం చేయడం పార్టీకి అతిపెద్ద మైనస్ అని చెప్పాలి.కుర్రాళ్ళకి ఎలాంటి ఆలోచనా విధానం ఉంటుందో అనుభవజ్ఞులైన పెద్దలకి తెలుసు కాబట్టి వారి ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

వారి ప్రచారం జనసేనకి ఏ మాత్రం సరిపోదనే విషయాన్ని కూడా విశ్లేషకులు ధృవీకరిస్తున్నారు.

అయితే కేవలం ప్రచారంలోకి కుర్రాళ్ళు మాత్రమే ఎందుకు వెళ్తున్నారు అనే ప్రశ్నలకి ఆ పార్టీ నేతలు ఇచ్చే సమాధానం షాక్ ఇస్తోంది.

కుర్రాళ్ళకి ఏమి చెప్పగలం చెప్పండి, అంతేగా.అంతేగా.

అంటూ తల ఊపుతున్నారట.దాంతో పార్టీలో ఉండే నేతలకి, కుర్రాళ్ళకి మధ్య సమన్వయం లేదని స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయపండితులు.

మరి కుర్రాళ్ళు జనసేన పార్టీని వచ్చే ఎన్నికల్లో ముంచుతారో, తేల్చుతారో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube