మీ పేరు "v" అక్షరంతో మొదలవుతుందా ? మీ జీవితంలో జరిగే ఆశ్చర్యకర విషయాలు     2017-12-04   21:08:26  IST  Raghu V

ఒక మనిషి పుట్టగానే ఆ మనిషి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పటానికి చాలా మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాలలో ఒకటి పేరులోని మొదటి అక్షరం ను బట్టి గుణగణాలను చెప్పటం. పేరులోని మొదటి అక్షరం వారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పుడు ‘ v ‘ అక్షరంతో పేరు మొదలయ్యే వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

మీ పేరు ‘v ‘ అక్షరంతో మొదలు అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీరు గొప్ప అంతర్ దృష్టి కలిగి ఉంటారు. ఏదైనా పని చేసినప్పుడు తొందరపడకుండా అలోచించి ముందడుగు వేస్తారు. అంతేకాని తొందరపడి ఏ పని చేయరు. వీరు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబం కోసం ఏమైనా చేయటానికి రెడీగా ఉంటారు. కుటుంబం కోసం ఎంతైనా ఖర్చు పెట్టటానికి రెడీగా ఉంటారు. కానీ బయట వ్యక్తులకు మాత్రం ఖర్చు పెట్టరు.


వీరు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించటంలో 99 శాతం సక్సెస్ అవుతారు. ఏది చేసిన కష్టపడి సాధిస్తారు. వీరు చదువులో బాగా రాణిస్తారు. అయితే కొన్ని సార్లు ఒత్తిడికి లోను అవుతారు. వీరు అనుకున్నది సులభంగా సాధిస్తారు. వీరు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటారు. వీరు స్వేచ్ఛగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తారు. వారి ఆలోచనలను,భావాలను అర్ధం చేసుకొని గౌరవిస్తారు. వీరు మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ఎదుటి వారు కష్టాల్లో ఉంటే సాయం చేయటానికి ముందుకి వస్తారు. చూసారుగా ‘v’ అక్షరంతో మొదలయ్యే పేరు గల వారి లక్షణాలు ఎలా ఉంటాయో…