అయ్యో పాపం : నైట్‌ డ్యూటీలు చేసే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు  

Does Working Night Shifts Lead To Infertility -

పెరిగిన అవసరాలు, ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ సమయం డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.కొందరు అయితే రాత్రి సమయంలో కూడా డ్యూటీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

Does Working Night Shifts Lead To Infertility

అత్యంత దయనీయమైన పరిస్థితులను నైట్‌ డ్యూటీలు చేసే వారు ఎదుర్కొంటున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.నైట్‌ డ్యూటీలు చేసే ఆడ అయినా మగ అయినా ఇబ్బందులు తప్పవని ముఖ్యంగా వారికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి సమయంలో సరిగా నిద్రలేక పోవడం వల్ల పగటి సమయంలో నిద్ర పోయేందుకు ప్రయత్నిస్తారు.కాని కొందరు మాత్రం పడటి సమయంలో కూడా నిద్ర పోలేక పోతారు.

అయ్యో పాపం : నైట్‌ డ్యూటీలు చేసే వారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు-General-Telugu-Telugu Tollywood Photo Image

కేవలం రాత్రి సమయంలో మాత్రమే నిద్ర పోయే అలవాటు ఉన్న వారు పగటి సమయంలో పడుకోవాలంటే కష్టమే.అలాంటి వారు నైట్‌ డ్యూటీలు చేస్తే వారి బాధ వర్ణనాతీతం.

రోజులో కనీసం మూడు నాలుగు గంటలు కూడా వారికి నిద్ర ఉండదు.దాంతో వారు అనారోగ్యం బారిన పడతారు.

అనారోగ్యంతో పాటు పలు దీర్ఘ కాలిక సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నైట్‌ షిప్ట్‌ల్లో జాబ్‌ చేసే మగాళ్ల స్పెర్మ్‌ కౌంట్‌ చాలా తగ్గినట్లుగా నిపుణుల పరిశోదనల్లో వెళ్లడయ్యింది.పిల్లలు పుట్టాలి అంటే మినిమంగా ఒక పురుషుడి స్పెర్మ్‌ కౌంట్‌ 15 మిలియన్లు ఉండాలట.ఈ సంఖ్య 10 మిలియన్ల వరకు వచ్చినా పర్వాలేదు కాని నెలల తరబడి నైట్‌ షిప్ట్‌లు చేసే వారిలో ఆ స్థాయిలో కూడా ఉండటం లేదట.

దాంతో వారు సంతాన లేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు.ఇక ఆడవారి పరిస్థితి కూడా అంతే ఉంది.సరైన నిద్ర లేక పోవడం వల్ల అండాల విడుదల తక్కువ అవుతుందట.

ఈ విషయంను నిపుణులు తెలియజేశారు.అందుకే నెలల తరబడి నైట్‌ షిప్ట్‌లు ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు.సంవత్సరంలో నాలుగు అయిదు నెలలు అది కూడా విడతల వారీగా అయితే ఏమో కాని ఒకేసారి కంటిన్యూస్‌గా నెలల తరబడి నైట్‌ షిప్ట్‌ డ్యూటీలు చేయవద్దని అందువల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయని అంటున్నారు.

తాజా వార్తలు

Does Working Night Shifts Lead To Infertility- Related....