ట్రోల్స్‌ : ఏంటీ విష్ణు.. మీ నాన్నను ఇలాగైనా మించాలని చూస్తున్నావా?

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు తండ్రి కాబోతున్నాడు.ఈ వార్త మరే ఏ హీరో విషయంలో అయినా మామూలు వార్తే, కాని మంచు విష్ణు విషయంలో మాత్రం ఇది చాలా స్పెషల్‌.

 Does Vishnu Want To Grow High Than His Father-TeluguStop.com

ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.అరియానా, విరియానా, ఆవ్రామ్‌ భక్త అనే ముగ్గురు పిల్లలకు ఇప్పటికే మంచు విష్ణు తండ్రి, ఈ సమయంలో విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు.

కొందరు ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

మంచు విష్ణు తాను మరోసారి తండ్రిని కాబోతున్నాను, నాల్గవ సంతానం రాబోతుంది అంటూ చెప్పిన వెంటనే చాలా మంది కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌ చేశారు.

అయితే కొందరు మాత్రం వింత వింతగా స్పందించారు.మోహన్‌బాబుకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె.ఇప్పుడు తండ్రిని బీట్‌ చేసేలా మంచు విష్ణు నలుగురు పిల్లలను కంటున్నాడు.ఒక వైపు తమ్ముడు మనోజ్‌ కనీసం ఒక్కరిపై కూడా ఆసక్తి చూపడం లేదు.

కాని మంచు విష్ణు మాత్రం ఏకంగా నలుగురు పిల్లలను తన ఫ్యామిలీలోకి తీసుకు వచ్చాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ట్రోల్స్‌ : ఏంటీ విష్ణు మీ నాన

ఒక వైపు ప్రభుత్వం కుటుంబ నియంత్రన అంటూ ప్రచారం చేస్తున్నా కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ మంచు విష్ణును కొందరు ప్రశ్నిస్తున్నారు.మరి కొందరు ఎందుకు మీరు మీ ప్రతి పిల్లలను అమెరికాలోనే పుట్టాలని కోరుకుంటున్నారు.వారికి అమెరికన్‌ పౌరసత్వం కావాలని మీరు ఎందుకు ఆశ పడుతున్నారు.

వారు ఇండియన్స్‌ అయితే ఏమవుతుంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి సోషల్‌ మీడియాలో రకరకాల ప్రశ్నలు మంచు విష్ణుపై కుమ్మరిస్తున్నారు.

అయితే వాటిపై మంచు విష్ణు స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube