భారతీయులకు వీసాలపై ట్రంప్ తీపి కబురు చెప్పనున్నారా..!!

ఆతిధ్యం ఇవ్వాలంటే భారత తర్వాతే అన్నట్టుగా ట్రంప్ కి భారీ స్థాయిలో ఆహ్వానం పలికింది భారత ప్రభుత్వం.సాధారణంగా ఇంటికి ఎవరైనా వస్తేనే వారికి ఏ లోటూ రాకుండా చూసుకోవలనుకుంటారు.

 Does Trump Announcing Good News On Indian Visa-TeluguStop.com

అలాంటిది అగ్రరాజ్య అధ్యక్షుడే భారత పర్యటనకు వస్తున్నారు అంటే ఎన్ని మర్యాదలు చేస్తాము, ఎంత అతిథి ధర్మాన్ని పాటిస్తాము.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నో జాగ్రత్తల నడుమ పర్యటన పూర్తి చేసుకొని ఎంతో సంతోషంగా తిరిగి అమెరికా వెళ్లారు.

మొత్తానికి “ఆధ్యాంతం ఆతిధ్యం అదరహో” అని ట్రంప్ నోటి నుంచి వచ్చింది.భారత పర్యటనా క్రమంలోనే.

మోడీ ట్రంప్ తో ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూనే హెచ్ 1బీ వీసా, హెచ్ -4 వీసాల ప్రస్తావన కూడా జరిగిందని సమాచారం.వీసాల విషయం మాత్రమే కాదు, అక్కడ నివసిస్తున్న భారత ప్రావాసీయులు ఎదురుకుంటున్న సమస్యల గురించి కూడా చర్చించారట.

అయితే దీనంతటికి ట్రంప్ కూడా సానుకూలంగానే స్పందిచారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే మోడీ మీడియాతో మాట్లాడుతూ…

Telugu Donald Trump, Hb Visa, Visa, Indian Visa, Telugu Nri, Trump-Telugu NRI

అమెరికా,భారతదేశాల మధ్య ఇంత చక్కటి స్నేహ సంబంధానికి ముఖ్య కారణం అక్కడ నివసిస్తున్న భారత సంతతికి చెందిన వాళ్ళు, భారతీయ నిపుణులు, విద్యార్ధులు కారణమని ట్రంప్ కు తెలియజేసినట్టుగా చెప్పారు.అతి శక్తివంతమైన అమెరికా ఆర్ధిక వ్యవస్థాభివృద్ధికి భారతీయుల కృషి ఎంతో ఉందని వారి సేవలను గుర్తిచి, వారికి వీసాలతో పాటు సామాజిక భద్రతను కూడా కల్పించాలని కొరినట్టు మోడీ వెల్లడించారు.ఇదిలాఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న సమయంలో, కొన్ని స్థానాల్లో భారత ప్రవాసీయుల మద్దతు ట్రంప్ కు ఎంతో కీలకమైనది.

ఇది దృష్టిలో ఉంచుకొనే త్వరలో భారత ఎన్నారైలకు సంబంధించి ట్రంప్ కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube