వండర్‌ : 'ఫణి' తుఫాన్‌ను తాబేళ్లు ముందే కనిపెట్టాయా?

ఏపీ, ఒరిస్సా రాష్ట్రాలను చిగురుటాకులా వణికించిన ఫణి తుఫాన్‌ తీరం దాటింది.తీరం దాటే సమయంలో ఒరిస్సాలో తీరం దాటడంతో ఏపీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.

 Does Tortoises Predicts Phani Toofan Earlier-TeluguStop.com

ఇదే సమయంలో ఒరిస్సాలో పెద్ద ఎత్తున విపత్తు వాటిల్లింది.ఒరిస్సాలో పలు సముద్ర తీరాలు, బీచ్‌లు కకలా వికలం అయ్యాయి.

ఈ సమయంలో ఒరిస్సాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.అందేంటి అంటే ఫణి తుఫాన్‌ను అలివ్‌ రిడ్లే తాబేళ్లు ముందే కనిపెట్టాయని, అందుకే అవి ఈసారి ఒరిస్సా సముద్ర తీరంకు రాలేదు అంటున్నారు

వండర్‌ : 'ఫణి' తుఫాన్‌ను తాబేళ్�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఒరిస్సాలో సహజ సిద్దమైన బీచ్‌లు చాలా ఉన్నాయి.ఆ బీచ్‌లు తాబెళ్ల పునరుత్పత్తికి చాలా అనుకూలంగా ఉంటాయి.అందుకే అలివ్‌ రిడ్లే తాబేళ్లు ఎక్కడెక్కడి నుండో వేసవి కాలంలో పునరుత్పత్తి కోసం ఒరిస్సా తీర ప్రాంతాలకు వస్తాయి.

ప్రతి ఏడాది లక్షలాది తాబేళ్లు వస్తాయి.గత ఏడాది దాదాపు 5 లక్షల రిడ్లే తాబేళ్లు బీచ్‌లకు వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుని పునరుత్పత్తి జరిపి సమ్మర్‌ పూర్తి అయ్యే టైంకు వెళ్లి పోతాయి.

ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది కాని, తగ్గడం లేదు అనేది స్థానికుల మాట.అయితే ఈసారిమాత్రం లక్షలు కాదు కదా కనీసం 10, 20 వేలు కూడా తాబేళ్లు రాలేదు.ఈ సంవత్సరం కేవలం 3 వేలు తాబేళ్లు మాత్రమే వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు

వండర్‌ : 'ఫణి' తుఫాన్‌ను తాబేళ్�

ఆ వచ్చిన మూడు వేల తాబేళ్లు కూడా ఫణి తుఫాన్‌ కారణంగా ఇబ్బంది పడ్డాయట.లక్షలాదిగా వచ్చే తాబేళ్లు ఎందుకు ఈసారి రాలేదు అనే విషయమై చర్చ జరుగుతుంది.ఈ సమయంలోనే ఫణి తుఫాన్‌ వచ్చిన కారణంగా, ఆ తుఫాన్‌ను ముందే ఊహించిన తాబేళ్లు ఒరిస్సా తీరానికి దూరంగా ఉన్నాయని, మరేదో స్థానంలో అవి పునరుత్పత్తి జరిపి ఉంటాయని అంటున్నారు.మొత్తానికి ఫణి తుఫాన్‌ను తాబేళ్లు ముందే కనిపెట్టాయి అంటూ జరుగుతున్న ప్రచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

ఈ విషయాన్ని వాతావరణ నిపుణులు మరియు జంతు సంరక్షణ అధికారులు కూడా సమర్ధిస్తున్నారు.

కొన్ని వారాల ముందుగానే తాబేళ్లకు ఎలా తుఫాన్‌ గురించి తెలిసింది అనే విషయాలను మనం తెలుసుకుంటే, తుఫాన్‌కు సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు చేసుకునే వీలు ఉంటుంది.ఆ దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తే బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube