అయ్యో.. ఈ పుకారు సమంత స్టార్ డమ్ ను తగ్గించేస్తుందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్న సమంత గురించి అందరికీ తెలిసిందే.

తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాతో తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.

ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement

ఇక అక్కినేని కోడలు అయ్యాక సమంతకు మరింత క్రేజ్ దొరికిందని చెప్పవచ్చు.పెళ్లి తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.

అంతేకాకుండా నాగచైతన్యతో కూడా పెళ్లి తర్వాత నటించింది.పైగా సొంతంగా కొన్ని బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

ఇక ఈ మధ్య సమంత పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

నాగ చైతన్యతో విడిపోతున్నానని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.దీంతో చాలామంది సమంత పై తప్పుబట్టారు.కారణం ఆమె స్టార్ హోదా లో ఉండటం ఒక రీజన్ అవుతే.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా ఒక కారణం అయ్యింది సమంత.ఇక తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాటికి అసలు పట్టించుకోలేదు.

Advertisement

మొత్తానికి నాగచైతన్యతో విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.పైగా టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు అందుకుంటుంది.బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుంది.

బాలీవుడ్ దర్శకులు కూడా సమంత కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత పై ఓ పుకారు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంతకీ అదేంటంటే సమంత ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇంతకు ఆ సినిమా ఏదో కాదు నాని నటిస్తున్న దసరా సినిమా.

ఇటీవలే ఈ సినిమా టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇందులో కీర్తి సురేష్ కాకుండా సమంతా కూడా నటిస్తుందని అది కూడా చిన్న పాత్రలో అని తెలుస్తుంది.స్టార్ హోదాలో ఉన్న సమంత సెకండ్ హీరోయిన్ గా నటించడం ఏంటి అని బాగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.దీంతో సమంత అభిమానులు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అవుతున్నారు.

మొత్తానికి ఈ పుకారు సమంత స్టార్ డమ్ ను తగ్గించేసేలా ఉందని తెలుస్తుంది.మరి ఈ విషయం గురించి సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.ఇక ఓ వైపు సమంత ట్రిప్స్ బిజీ లో బాగా ఎంజాయ్ చేస్తుంది.

దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.ఇక శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు