టీడీపీ, జనసేనపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఏపీలో అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
చంద్రబాబు తాబేదారుగా పవన్ పని చేస్తున్నారని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు.ఏ ఆధారాలతో పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారని ప్రశ్నించారు.
ఏపీలో జరిగిన అభివృద్ధి మరే ఇతర రాష్ట్రంలోనూ లేదని చెప్పారు.ఇళ్ల పట్టాలతో పాటు 21 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మీకు కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు.జనసేనానికి ఏపీలో ఆధార్ కార్డు లేదు, ఓటు లేదని విమర్శించారు.
చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదన్న ఆయన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో పవన్ కు ఎంతో ముట్టిందో చెప్పాలన్నారు.అలాగే రైతులను నట్టేట ముంచిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు.
రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే కావాలనే బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.