Tamannaah : తమన్నాకు స్కూల్ డేస్ నుంచి ఆ అలవాటు ఉండేదా.. వామ్మో మామూలు గడుసుది కాదుగా?

Does Tamanna Have That Habit Since Her School Days

టాలీవుడ్( Tollywood ) లో మిల్కీ బ్యూటీగా అందరి మనసులు దోచుకున్న తమన్నా( Tamannaah ) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తన అందాలతోనే కాకుండా నటన పరంగా కూడా ఫిదా చేసింది.

 Does Tamanna Have That Habit Since Her School Days-TeluguStop.com

ముఖ్యంగా తన డాన్స్ పట్ల అందర్నీ ఆకట్టుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ లో అడుగుపెట్టింది.

తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ( sri ) అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

చాలావరకు స్టార్ హీరోలతో చేసింది.ఇక పాన్ ఇండియా మూవీ బాహుబలి( Bahubali ) లో కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది.

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.

సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా చేస్తూ ఉంటుంది.ఇక ఈమధ్య ఈ బ్యూటీ కి అంతగా కలిసి రావడం లేదు.

సరైన సక్సెస్ అనేది లేకపోవడంతో మంచి సక్సెస్ కోసం బాగా ఎదురు చేస్తుంది.ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బాగా బిజీగా ఉందని చెప్పాలి.

ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.బాగా వర్క్ అవుట్ లు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమెకు చదువుకునే రోజుల నుంచి ఒక అలవాటు ఉందని తెలుస్తుంది.అదేదో కాదు.

డాన్స్ చేయటం.మామూలుగా ఈ ముద్దుగుమ్మ సినిమాలలో చేసే డాన్స్ మామూలుగా ఉండదని చెప్పాలి.

మంచి ఎనర్జీ తో డాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది.ఏ స్టెప్పునైన ఇట్టాగే చేస్తుంది.

అయితే ఈమెకు ఇది ఇప్పుడు నేర్చుకున్న విద్య.అది చిన్నప్పటినుంచి నేర్చుకున్న విద్య అని తెలుస్తుంది.

తాజాగా తమన్నా ఇన్స్టాల్ లో తన చిన్ననాటి ఫోటో షేర్ చేసుకుంది.

అందులో తను స్కూల్ డేస్ లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్లలో వేదికపై డాన్స్ చేసినట్లు కనిపించింది.ఇక అందులో తను వైట్ అవుట్ ఫిట్ తో కనిపించగా.ఆ సమయంలో కూడా తను తెలుపు రంగులో చాలా అందంగా ఉంది.

ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో.ఆ ఫోటో చూసి తన అభిమానులు మరోసారి ఫిదా అవుతున్నారు.

తమన్నాకు చిన్నప్పటినుండి డాన్స్ చేయటం ఇష్టమేమో.చాలా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.

ఇక మరి కొంతమంది తమన్నా మామూలు గడుసు అమ్మాయి కాదు కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube