ఆ గ్రహంపై జీవుల ఆనవాళ్లు... నిజంగా ఏలియన్లు ఉన్నాయా?

మనం ప్రస్తుతం భూ గ్రహంపై జీవిస్తున్నాం.భూ గ్రహంలో మనుషులు జీవించడానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి.

 Does Phosphine Mean Alien Life On Venus, Phosphine, Aliens, Scientists, Phosphin-TeluguStop.com

మరి మనం నివశించే గ్రహంలాగా ఇతర గ్రహాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయా….? అంటే ఖచ్చితంగా లేవు.అయితే శాస్త్రవేత్తల పరిశోధనల్లో పలు గ్రహాల్లో జీవాలు ఉన్నట్టు తేలింది.తాజాగా శాస్త్రవేత్తలు శుక్ర గ్రహంపై ఫాస్పైన్ ఆన‌వాళ్లు ఉన్నాయని… అక్కడ రసాయన మేఘాలను గుర్తించామని తెలిపారు.

సాధారణంగా రసాయన మేఘాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సూక్ష్మ క్రిములు జీవిస్తాయని… ఈ విధంగా చూస్తే అక్కడ జీవం ఉన్నట్టే భావించాలని చెప్పారు.శాస్త్రవేత్తలు వెల్లడించిన కీలక విషయాలు నేచ‌ర్ ఆస్ట్రాన‌మీలో ప్రచురితం అయ్యాయి.

20 పార్ట్స్ ప‌ర్ బిలియ‌న్‌గా ఫాస్పైన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు తొలుత భావించగా అక్కడ ఊహించిన దాని కంటే ఎక్కువ మొత్తంలోనే పాస్పైన్ ఉందని తేలింది.

అయితే శాస్త్రవేత్తలు శుక్ర గ్రహంపై జీవాలు ఉన్నాయో లేదో మాత్రం కనిపెట్టలేకపోయారు.

మరిన్ని పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడిస్తామని వాళ్లు చెబుతున్నారు.మనం జీవించాలంటే ఆక్సిజన్ అవసరమని… అయితే కొన్ని జీవులు పాస్పైన్ సహాయంతో కూడా జీవించగలవని ఖ‌గోళ‌శాస్త్ర‌వేత్త క్లారా సౌసా సిల్వా చెప్పారు.

శుక్రుడిపై పాస్పైన్ ఉంటే మనం ఒంటరి కాదని గుర్తుంచుకోవాలని అన్నారు.సాధారణంగా పాస్పైన్ చాలా విషపూరితమైన వాయువు.

ఈ పాస్పైన్ ఆక్సిజన్ లభ్యం కాని ప్రాంతాల్లో బ్యాక్టీరియాను సులభంగా ఉత్పత్తి చేయగలదు.శుక్రగ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని వార్తలు రావడంతో మరోసారి ఏలియన్ల గురించి చర్చ జరుగుతోంది.

ఏలియన్లపై శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.మరి నిజంగా ఏలియన్లు ఉన్నాయో లేదో తెలియాల్సి ఉంది.

శాస్త్రవేత్తలు భూమి నుంచి రేడియో తరంగాలను పంపి ఏలియన్లతో సంప్రదింపులు జరపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే మనిషి పంపిన ఏ సందేశానికి ఏలియన్లు ఇప్పటివరకు స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube