పవన్ టీడీపీని ఆక్రమించేస్తాడా ? బాబు భయం అదేనా ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ చాణిక్యత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే విషయం లో చంద్రబాబు నాయుడుని ఉదాహరణగా చూపించే అంత స్థాయిలో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరానికి చేరారు.

 Does Pawan Occupies Tdp-TeluguStop.com

అయితే ఇప్పుడు అదే చంద్రబాబు ఓ విషయంలో బాగా భయపడుతున్నట్టు తెలుస్తుందో.ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఎదురుగాలి వీస్తుండడంతో ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా బాబు లో రోజు రోజుకి తగ్గుతూ వస్తోంది.

పార్టీ గెలుపు కోసం అభ్యర్థులకు, నాయకులకు దిశా నిర్దేశం చేసినా ఆశించిన స్థాయిలో ఫలితం మాత్రం వచ్చినట్టు కనిపించడంలేదని బాబు భావిస్తున్నాడు.

ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా బాబు అంతకు ముందులా యాక్టివ్ గా ఉండే పరిస్థితి కనిపించడంలేదు.పార్టీలో చంద్రబాబు ఎప్పుడు బలహీనం అవుతాడో సమస్యలు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి.2024 ఎన్నికల సమయానికి పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో కొనసాగితే ఆరోగ్యం సహకరించక చంద్రబాబు రాజకీయాల్లో చురుగ్గా లేకపోతే టీడీపీని నడిపించే సమర్థుడైన నాయకులు లేక టీడీపీని అభిమానించే బలమైన కమ్మ సామాజిక వర్గం టీడీపీతోనే ఉంటుంది.కానీ బీసీలు పవన్‌ కళ్యాణ్‌ వైపు మళ్లితే టీడీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూసుకుంటే ఏపీలో కమ్యూనిస్టు పార్టీలు చాలా బలమైనవి.

అయితే అవి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక.ఆ పార్టీల్లోని చాలామంది కార్యకర్తలు టీడీపీలోకి వెళ్ళిపోయారు.

ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు క్యాడర్‌ కోల్పోయి మనుగడే ప్రశ్నర్ధకంగా మారిపోయాయి.

ఇప్పుడు చంద్రబాబు కూడా అదే స్ట్రాటజీ ని చూసి భయపడుతున్నాడు.ఒక వేళ ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే కనుక రాబోయే ఎన్నికల నాటికి చంద్రబాబుకు వయసు మీద పడుతుంది.ఇప్పటిలాగా ఎన్నికల్లో పోరాడలేకపోవచ్చు,పార్టీని కాపాడుకునే అంత సామర్ధ్యం లోకేష్‌కు లేదు.

పవన్‌ కళ్యాణ్‌ చూస్తే యూత్ ని ఆకట్టుకోవడంలో బాగా సక్సెస్ అయ్యాడు.ఈ ఎన్నికల్లో పైకి కనిపించకపోయినా లోలోపల జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తుండడం కూడా బాబు లో భయాన్ని పెంచుతోంది.

అందుకే పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ బలపడకుండా బాబు జాగ్ర పడుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube