ఆ విషయం ముందే తెలిసిపోయిందా పవన్ ?  

Does Pawan Already Know This-elections,fans,party Candidates,political Updates,politics,పవన్

సినిమా అభిమానం వేరు , రాజకీయ అభిమానం వేరు. సినీ అభిమానులంతా రాజకీయంగా తమను అదే రేంజ్ లో అభిమానిస్తారు అంటే అది పొరపాటే. ఎందుకంటే రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులను అధిగమించాలి..

ఆ విషయం ముందే తెలిసిపోయిందా పవన్ ?-Does Pawan Already Know This

సామజిక సమీకరణాలు, డబ్బు, పోల్ మేనేజ్మెంట్ ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటన్నిటిలో సక్సెస్ అయితేనే గెలుపు అనేది వారి వారి ఖాతాలో పడుతుంది. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బాగా అర్ధం అయినట్టు కనిపిస్తోంది.

ఎన్నికల ముందు గెలుపుపై ధీమాగా ఉన్న పవన్ ఎన్నికల తరువాత ఆ ధీమా సడలిపోయింది. ఎన్నికల ముందు పవన్ చరిష్మా మీద నమ్మకంతో వివిధ పార్టీల నుంచి అనేక మంది నాయకులు వలస వచ్చి జనసేన కండువా కప్పుకున్నారు.

నాయకుల చేరికతో పార్టీకి ఊపు పెరిగిందని, ఎన్నికల్లో పవన్ చక్రం తిప్పబోతున్నారని అంతా అనుకున్నారు.

కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీకి అంతగా అనుకూలించలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడినప్పుడు జనసేనలోకి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకే ఎక్కువ మంది నాయకులు వలస వెళ్లారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన వారు కూడా వైసీపీ వైపు వెళ్లడానికే ఆసక్తి చూపారు.

కానీ యూత్ మాత్రం పవన్ కోసం తీవ్రంగా కష్టపడి ఓటు బ్యాంక్ పెంచడానికి ప్రయత్నించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జనసేన ప్రభావం అంతగా ఉండదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవల అభ్యర్థులతో జరిగిన సమావేశంలోనూ పవన్ దాదాపుగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

అందుకే ఇప్పుడా పార్టీ అందరికి టార్గెట్ మారిపోయింది. ఎన్నికల ఫలితాల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపైనే పవన్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారట..

తద్వారా పార్టీ సంస్థాగతంగా పటిష్ఠమవుతుందని విశ్వసిస్తున్నారని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవడం ద్వారా సంస్థాగతంగా బలోపేతం అవ్వొచ్చంటూ హితోపదేశం చేస్తున్నాడు.