మరీ ఇంత నటనా పవన్...?? ఎన్నికల కోసమేనా ఇదంతా..???  

Does Pawan Acts Just For Elections-

ఏపీలో ఎన్నికల ప్రక్రియ అయిపొయింది.రిజల్స్ రావడమే తరువాయి.చంద్రబాబు ఈ ఎన్నికల విషయంలో రచ్చ రచ్చ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో సైలెంట్ గా తమపని తాము చేసుకుంటూ పరిస్థితులని గమనిస్తున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై రకరకాల విమర్శలు వస్తున్నాయి.పవన్ తాజా ఫోటో పై ఎన్నో కధనాలే అందుకు కారణం అవుతున్నాయి.ఆ వివరాలలోకి వెళ్తే.

Does Pawan Acts Just For Elections--Does Pawan Acts Just For Elections-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చూపించిన పెర్ఫార్మెన్స్ అంతా ఇంతా కాదని.

Does Pawan Acts Just For Elections--Does Pawan Acts Just For Elections-

ఏపీ ప్రజలు ఇలాంటి నాయకుడు మనకి కావాలి అనేట్టుగా ప్రచార సమయంలో పవన్ ప్రవర్తించిన తీరుతో ప్రధాన పార్టీల అధినేతలకు దిమ్మ తిరిగిపోయిందని, చెట్టు కింద కూర్చుని మట్టిపాత్రలో పెరుగు అన్నం తినటం, లేదంటే కారు లగేజ్ స్పేస్ లో పడుకుని ఫోజులు ఇవ్వడం, రోడ్డుమీద పశువులను ముద్దాడటం ఇలా పవన్ కల్యాణ్ తాను ఒక సాధారణ వ్యక్తి లాగా ఏపీ ప్రజలకు కలరింగ్ ఇచ్చాడంటూ పవన్ పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు.

అయితే అప్పట్లో ఆ ఫోటోలను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తమ తమ వాట్సాప్ గ్రూపు లో షేర్లు చేసుకుంటూ ఇలాంటి ఇలాంటి నాయకుడే ఏపీకి కావాలి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి వైరల్ అవటంతో, ఆ ఫోటో పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

నిన్నటి వరకు పవన్ నటించిన సినిమా అయిపోయిందని ఇక ప్రస్తుత నిజ జీవితంలోకి పవన్ అడుగుపెట్టాడు అంటూ జనసేనని పై విమర్శలు వస్తున్నాయి.

కేవలం తన అభిమానులను ప్రజలను ఆకట్టుకోవడానికి మాత్రమే పవన్ జులపాల జుట్టుతో , గుబురుగా పెంచిన గడ్డంతో ,ఓ మాస్ లీడర్ కనిపించడానికి ప్రయత్నించారని.కానీ రాజకీయాలు అయిపోయాయి కాబట్టి హెయిర్ కట్ చేసుకుని, క్లీన్ షేవ్ తో న్యూ లుక్ తో కనిపించారని అంటున్నారు.

రాజకీయాల్లో తన నటన అయిపోయిందని ఇక సినిమాల్లో నటించడమే మిగిలిందని అంటూ లెక్కకు మించి విమర్శలు రావడంతో జన సైనికులు తమ భవిష్యత్తు విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఫోటో విషయంపై జనసేన వర్గాలు మాత్రం అది పాత ఫోటో అని ప్రస్తుతం పవన్ ఎన్నికల సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారని అంటున్నారు.