టీవీ 9 గొడవలో కేసీఆర్ హస్తం ఉందా ఏంటి ?

మెరుగైన సమాజం క్యాప్షన్ తో తెలుగు మీడియాలోనే ఒక నూతన ట్రెండ్ సృష్టించి తెలుగు మీడియాలో అగ్రగామి ఛానెల్ గా వెలుగొందుతున్న tv9 లో ఇప్పుడు వివాదాలు అలుముకున్నాయి.ముఖ్యంగా ఆ ఛానెల్ సీఈఓ రవిప్రకాష్ మీద హైదరాబాద్ లో ఫోర్జరీ కేసు నమోదైంది.

 Does Kcr Had Any Connection In Tv9s Conflict 9-TeluguStop.com

అంతే కాదు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు.నేడే రేపో రవిప్రకాశ్ విచారణకు హాజరుకావచ్చు.

కానీ ఈ ఉదంతం వెనుక ఎవరి హస్తం అయినా ఉందా ? టీవీ 9 మీద ఎవరైనా కక్ష కట్టారా ? తదితర అంశాలన్నిటిలోనూ ఇప్పుడు అందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ మీదే పడుతోంది.

ఇక టీవీ 9 విషయానికి వస్తే మొదటి నుంచి ఆ ఛానెల్ బ్యాలెన్స్ గా న్యూస్ కవరేజ్ ఇచ్చినా ఆ తరువాత తరువాత టీడీపీ అనుకూల మీడియా గా పేరుపడింది.

ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ఛానెల్ ను టీడీపీ మీడియా గా పిలుస్తూ హడావుడి చేశారు.ఇక తెలంగాణాలో ఈ ఛానెల్ మీద కొన్నాళ్ళు నిషేధం కూడా విధించారు.

దీనికి కారణం అప్పట్లో టీవీ 9 లో ఎవడిగోల వాడిదే అనే కామెడీ ప్రోగ్రామ్ ప్రచారం అయ్యేది దాని కారణంగా ఆ ఛానెల్ ఇబ్బందులు ఎదుర్కొంది.కొన్నాళ్ల తరువాత రాజీ కుదరడంతో యధావిధిగా ప్రచారాలు జరిగాయి.

టీవీ 9 గొడవలో కేసీఆర్ హస్తం ఉం�

ప్రస్తుతానికి ఆ ఛానెల్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడుగా పేరున్న పారిశ్రామికవేత్త మైహోమ్ రాజేశ్వరరావు ఈ ఛానెల్ ను కొనుగోలు చేశారు.ఇంకేముంది ఇక నుంచి ఆ ఛానెల్ లో అన్ని గులాబీ పార్టీకి అనుకూల కథనాలే ప్రచారం అవుతాయని అంతా భావించారు.కానీ అలా ఏమీ జరుగకపోగా టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ గా కథనాలు ప్రచారం అవ్వడం గులాబీ పార్టీకి మంట కలిగించింది.అది అలా ఉండగానే మొన్న ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో హఠాత్తుగా రవిప్రకాశ్ తెర పైకి వచ్చి టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేసాడు.

ఆ కారణంతో రవి ప్రకాష్ మీద పీకల్లోతు కోపం పెంచుకున్నారని, అందుకే ఇప్పుడు ఇంత వేగంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలంగాణాలో చర్చ నడుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube