జనసేనకు 'స్టార్' ఇమేజ్ తగ్గిందా ? కారణం ఏంటి ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు.ఆయన పేరు చెప్తే చాలు అభిమానులు ఊగిపోతుంటారు.

 Does Janasena Star Image Has Reduced-TeluguStop.com

ఎక్కడికి వెళ్లినా ఆయనకు బ్రహ్మరధం పడుతుంటారు.అదే ఇమేజ్ తో రాజకీయ పార్టీ పెట్టిన పవన్ తక్కువ కాలంలోనే బలమైన ప్రత్యర్థి పార్టీలను భయపెట్టే రేంజ్ లో తన పార్టీ జనసేనను తీర్చిదిద్దాడు.

దీనంతటికీ కారణం పవన్ అభిమానులే.అదే ఊపుతో ఇప్పుడు ఎన్నికలకు వెళ్లి తన సత్తా ఏంటో ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.

కానీ అది క్షేత్ర స్థాయిలో అనుకున్నంత సులువు కాదని పవన్ కి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది.ముందుగా తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తామని చెప్పిన పవన్ ఆ తరువాత సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్తోంది.

మిత్ర పక్ష పార్టీల బాధ్యత కూడా తీసుకున్న పవన్ అన్నీ తానై ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నాడు.ప్రస్తుతం పోలింగ్ తేదీ దగ్గరకు వస్తున్న తరుణంలో మొత్తం నూట డబ్భై ఐదు నియోజకవర్గాల బాధ్యత పవన్ మీద పడింది.

ఇంత తక్కువ సమయంలో అన్ని నియోజకవర్గాలను కవర్ చేయడం కుదరదు కనుక పవన్ కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాలపై దృష్టిపెట్టాడు.మిగతా చోట్లకు తిరుగుదామని ఉన్నా వెళ్లలేని పరిస్థితి ఉంది.

కానీ ఇటువంటి కీలక సమయంలో పవన్ ఒక్కరే కాకుండా మెగా ఫ్యామిలీ హీరోలు, పవన్ ను ఆరాధించే యంగ్ హీరోలు ఎన్నికల ప్రచారానికి వస్తే జనసేనకు కలిసివస్తుంది అనే వాదనలు తెరపైకి వస్తున్నాయి.

జనసేన తరపున ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా పవన్ కోరితే చిరంజీవి రాక పోవచ్చు కానీ రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సహా మిగతా మెగా హీరోలంతా సిద్ధంగా ఉన్నారు.వీరంతా ఎన్నికల ప్రచారానికి దిగితే సమీకరణాలు మారే అవకాశం కూడా ఉంది.చిరు కుటుంబ హీరోలైన చరణ్, అర్జున్ సహా మిగతా హీరోలంతా పవన్ పిలవాలే కానీ తామంతా ప్రచారం చేయడానికి సిద్దమే అని గతంలోనే ప్రకటించారు.

అంటే ఇప్పటికీ వారిని పవన్ ఆహ్వానించలేదని అర్థం అవుతోంది.జనసేన తరఫున ఎన్నికల ప్రచార భారం మొత్తం పవన్ ఒక్కరే భరిస్తున్నారు.పవన్ అన్న నాగబాబు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉండడంతో ఆ పరిధి దాటి బయటకి వెళ్లి ప్రచారం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube