'పీకే' సర్వేలో ఇలా తేలిందా ? జగన్ అందుకే కలిశాడా ?  

Does It Get Exposed In Pk Survey-elections,exposed,pk Survey,political Updates,report,survey,ycp,ys Jagan

హోరా హోరీగా సాగిన ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిది అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. నువ్వా నేనా అనే రేంజ్ లో జరిగిన ఈ ఎన్నికల పందెంలో వైసీపీకే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టు ఇప్పటికే అనేక సర్వేలు స్పష్టంగా తేల్చేశాయి. దీంతో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది..

'పీకే' సర్వేలో ఇలా తేలిందా ? జగన్ అందుకే కలిశాడా ? -Does It Get Exposed In PK Survey

ఈ క్రెడిట్ అంతా మీదే అంటూ పీకేను అమాంతం ఆకాశానికి ఎత్తేసాడు జగన్.ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి పీకే బృందానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ రెండు సంవత్సరాలు తమ పార్టీ కోసం ఎంతగానో కృషి చేశారని, మీకు రుణపడి ఉంటానని పీకే బృందంతో జగన్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా జగన్ కు పీకే తన సర్వే రిపోర్ట్ ను అందజేసాడట. ఏపీలో మొత్తం 20 పార్లమెంటు స్థానాలతో పాటు 125 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతున్నట్లు పీకే బృందం నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ సర్వే నివేదికలో ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు పీకే బృందం జగన్ కు నివేదిక అందించింది.

ఆ నివేదిక చదివిన జగన్ పవన్ ప్రభంజనం ఉన్నా వైసీపీకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయని, దీనివల్ల ఎక్కువ నష్టపోయేది టీడీపీ అని చెప్పాడట.

పీకే నివేదిక ప్రకారం పవన్ గాజువాక, భీమవరం స్థానాల్లో గెలుస్తున్నట్లు ఈ సర్వేలో పీకే తేల్చాడట. గాజువాక, భీమవరంలతో పాటు మరో నాలుగు స్థానాలను అంటే మొత్తం ఆరు స్థానాలను జనసేన దక్కించుకుంటుంది పీకే బృందం తేల్చేసింది. పవన్ కల్యాణ్ కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకే ఎక్కువ నష్టం జరిగినట్లు ఈ బృందం గుర్తించింది.

మొత్తంగా ఈ జిల్లాలో టీడీపీకి నాలుగు స్థానాలు దక్కనున్నట్లు పీకే బృందం సర్వేలో తేలినట్లు చెబుతున్నారు.